ఇక యువరాజ్, సెహ్వాగ్ లు జట్టులోకి వచ్చేస్తారా?!

ప్రపంచకప్ లో భారత జట్టు ఓటమిని ఆటగాళ్లు అయితే పూర్తి లైట్ తీసుకొన్నారు. చిన్నా చితక జట్ల మీద వరస విజయాలు సాధించేసి.. అసలైన మ్యాచ్ లో కనీసం పోరాటం చూపకుండా ఓటమిని మూటగట్టుకొన్న…

ప్రపంచకప్ లో భారత జట్టు ఓటమిని ఆటగాళ్లు అయితే పూర్తి లైట్ తీసుకొన్నారు. చిన్నా చితక జట్ల మీద వరస విజయాలు సాధించేసి.. అసలైన మ్యాచ్ లో కనీసం పోరాటం చూపకుండా ఓటమిని మూటగట్టుకొన్న మనోళ్లు స్వదేశానికి వచ్చేశారు. ఆ వచ్చేయడంలో కూడా గర్ల్  ఫ్రెండ్స్ తో సాన్నిహిత్యాన్ని ప్రదర్శించేసి తాము సెమిస్ ఓటమిని పిచ్చ లైట్ తీసుకొన్నామనే విషయాన్ని అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు! వంద కోట్ల పై బడ్డ అభిమానుల కోసం కూడా వీళ్లు కాసేపు మొహాన్ని వేలాడేసుకోలేకపోయారు!

మరి ఇప్పుడు వాట్ నెక్ట్స్ అంటే.. కెప్టెన్ ధోనీ అధికారాలకు కూడా చాలా వరకూ కత్తెరలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువరాజ్ , సెహ్వాగ్ , గంభీర్ వంటి వాళ్లకు మళ్లీ ఛాన్సులిచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచకప్ కు ముందు వరకూ టీమ్ సెలక్షన్ విషయంలో ఏకఛత్రాధిపత్యంగా సాగిన ధోనీ ఆదిపత్యానికి ఇక బ్రేకులు పడే అవకాశాలున్నాయి.

ఆటతో గాక ధోనీ మద్దతుతో జట్టులో కొనసాగుతున్న రవీంద్ర జడేజా వంటి వాళ్లపై కచ్చితంగా నెక్ట్స్ సీరిస్ ల విషయంలో వేటు పడే అవకాశాలున్నాయి. త్వరలో ఐపీఎల్ జరగబోతోంది. దాంట్లో రాణించిన కొత్త మొహాలకు కూడా భవిష్యత్తులో చోటు లభించవచ్చు. మొత్తానికి ప్రపంచకప్ లో వరస విజయాలు సాధించి ఉత్తమ కెప్టెన్ గా ప్రశంసలు పొందిన ధోనీ గతి ఒక్క ఓటమితో మారిపోవడం మాత్రం దాదాపు ఖాయమే!