మెగా అమ్మాయిని ఒంటరిగా వదిలేసారు

పవన్ కళ్యాణ్..రామ్ చరణ్..బన్నీ..సాయిధరమ్..ఇలా రాసుకుంటూ పోతే కాస్త పొడగాటి జాబితానే..మెగా 'స్టార్ల'ది. వీరందరి లాంచింగ్ ఇంతో అంతో గొప్పగానే సాగింది. కానీ పాపం, కొణిదెల నీహారిక లాంచింగ్ మాత్రం జస్ట్ ఫ్యామిలీ అఫైర్ అన్నట్లుగా…

పవన్ కళ్యాణ్..రామ్ చరణ్..బన్నీ..సాయిధరమ్..ఇలా రాసుకుంటూ పోతే కాస్త పొడగాటి జాబితానే..మెగా 'స్టార్ల'ది. వీరందరి లాంచింగ్ ఇంతో అంతో గొప్పగానే సాగింది. కానీ పాపం, కొణిదెల నీహారిక లాంచింగ్ మాత్రం జస్ట్ ఫ్యామిలీ అఫైర్ అన్నట్లుగా సాగిపోయింది.  నిజానికి మెగా ఫ్యామిలీ ఈ ఈవెంట్ ను మరింత ఘనంగా చేయాలి. ఎందుకంటే తమ ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి తొలిసారి స్క్రీన్ మీదకు వస్తోంది కాబట్టి. కానీ ఆ వైనం వారికి అంతగా పట్టినట్లు కనిపించలేదు. కూతురు కాబట్టి నాగబాబు అటెండెన్స్ ఓకె. మరి మిగిలిన వారు ఎవరూ కనిపించలేదు. దర్శకుడు రామరాజు తొలి నిర్మాతలు కాబట్టి ఆకొండి సూర్యనారాయణ వచ్చారు. అలాగే ఆయన సోదరి ఉమాదేవి. టీవీ 9 ప్రతినిధులు ఒకరిద్దరు మాత్రం హాజరయ్యారు. 

నిజానికి తన తొలి సినిమా కాబట్టి భారీ ఓపెనింగ్ ఫంక్షన్ చేయమని నీహారిక నిర్మాతను కోరినట్లు వినికిడి. తాను మెగా హీరోలను అందర్నీ పిలుస్తానని అందట. ఇది మొదట్నంచీ వస్తున్న మాట. కానీ ఎవరూ రావడానికి అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో, తరువాత అడియోఫంక్షన్ భారీగా చేస్తామనే సాకుతో, ఈ ఫంక్షన్ ను సింపుల్ గా కానిచ్చేసారు. నిజానికి ఇప్పుడు మెగా హీరోలు అందరూ కాస్త అందుబాటులోనే వున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ, బన్నీ, వరుణ్, పవన్ ఇలా అందరూ లోకల్ గానే వున్నారు. కానీ ఎవరూ రాలేదు. 

నిజానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైవుంటే ఈ సినిమాకు అమాంతం హైప్ వచ్చి వుండేది. ఆ అమ్మాయికి కూడా మోరల్ సపోర్ట్ గా వుండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరిగి వుండేవి. కానీ అలా జరగలేదు. మెగా ఫ్యామిలీ జనాలకు నీహారిక హీరోయిన్ గా నటించడం అంత ఇష్టం లేదని తొలి నుంచీ వార్తలు వినవస్తూనే వున్నాయి.ఈ ఫంక్షన్ ఇంత సింపుల్ గా జరిగిదంటే..అదే నిజమమే అనిపిస్తోంది.