యధా ఆర్జీవీ..తథా పూరి

గురువును మించిన శిష్యుడయిడే మన పూరి జగన్నాధ్.  రామ్ గోపాల్ వర్మకు వేలువిడిచిన శిష్యరికం పూరి సాబ్ ది. అందుకే నేమో ఆయన కూడా  అదే బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. కెమేరా మెన్ గంగతో…

గురువును మించిన శిష్యుడయిడే మన పూరి జగన్నాధ్.  రామ్ గోపాల్ వర్మకు వేలువిడిచిన శిష్యరికం పూరి సాబ్ ది. అందుకే నేమో ఆయన కూడా  అదే బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. కెమేరా మెన్ గంగతో రాంబాబు తరువాత టక్కున పెద్ద హీరోల నుంచి కిందకు దిగి నితిన్ తో హార్ట్ ఎటాక్ చేసారు. అది ఆర్జీవీ స్టయిలే. 

అందుబాటులో ఎవరు వుంటే వాళ్లతో సినిమా చేసేయడం. ఇక్కడ ఆయనను మించిన వాడెట్లా అయ్యాడంటే, పూరి అందుబాటులో ఎవరు వుంటే వార్ని పట్టుకుంటారు..పూరి ఫామ్ లో ఎవరు వుంటే వాళ్లను ఎంచుకుంటారు. సరే ఈ సంగతి అలా వుంచితే, వర్మ చిత్రాతి చిత్రమైన అయిడియాలు చేస్తున్నట్లే ఇపుడు పూరి కూడా కొత్త అయిడియా చేసారు. 

కుర్రాళ్లకు రోజుకో కథ చెప్పి, వాటిని షార్ట్ ఫిలింలు తీయమని చెబుతున్నారు. అయితే ముందు జాగ్రత్తగా స్వంత డబ్బలు ఖర్చు  చేయద్దని, ఎవర్నైనా ఒప్పించి వాళ్లచేత ఖర్చు చేయించమని అంటున్నారు. అలా ఒప్పించలేకపోతే, భవిష్యత్ లో దర్శకుడిగా ఎవర్ని ఎలా ఒప్పించగలరు అంటున్నారు. కొత్త టాలెంట్ కావాలంట ఇండస్ట్రీకి. ఇలా ఇంకా చాలా అయిడియాలు చేయాలి పూరి. అప్పుడు కానీ రామ్ ను మించిపోయారు అని అనుకోరు జనం.