శ్రీమంతుడులో నెపోలియన్?

మన వాళ్ల కథల్లో మంచి క్యారెక్టర్ ఒకటి వుందీ అంటే వెంటనే చూపు పక్కింటి పరిశ్రమల మీద పడుతుంది. అది ఈగ,మిర్చి, వరుడు, ఇలా మరేదైనా కావచ్చు. ఇప్పుడు ఇలాంటిదే మరో మంచి క్యారెక్టర్…

మన వాళ్ల కథల్లో మంచి క్యారెక్టర్ ఒకటి వుందీ అంటే వెంటనే చూపు పక్కింటి పరిశ్రమల మీద పడుతుంది. అది ఈగ,మిర్చి, వరుడు, ఇలా మరేదైనా కావచ్చు. ఇప్పుడు ఇలాంటిదే మరో మంచి క్యారెక్టర్ తమిళ నటుడు నెపోలియన్ ను వరించినట్లు తెలుస్తోంది. 

నెపోలియన్ మంచి నటుడు..పలు డబ్బింగ్ సినిమాల ద్వారా, కొన్ని స్ట్రయిట్ సినిమాల ద్వారా తెలుగు జనాలకు కాస్త పరిచయమే. ఇప్పుడు మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లోని ఓ పాత్రకు నెపోలియన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెపోలియన్ రాజకీయాల్లో కూడా బిజీగా వున్నారు. తెలుగులో ఆయన తన సత్తా చూపిస్తారిప్పుడు.