బాహుబలి పార్ట్ 2 కథేమిటి?

అస్సలు చూచాయిగా తెలియక ముందే బాహుబలి కథపై అనేక వదంతులు షికార్లు చేసేసారు. బోలెడు మంది కథను తయారు చేసి, వాట్సప్ లో తిప్పేసారు. దాన్ని పట్టుకుని మీడియా కథనాలు వండివార్చింది. అలాంటి నేపథ్యంలో…

అస్సలు చూచాయిగా తెలియక ముందే బాహుబలి కథపై అనేక వదంతులు షికార్లు చేసేసారు. బోలెడు మంది కథను తయారు చేసి, వాట్సప్ లో తిప్పేసారు. దాన్ని పట్టుకుని మీడియా కథనాలు వండివార్చింది. అలాంటి నేపథ్యంలో తొలిసగం విడుదలయింది. దాదాపు సగం కథ విప్పి చెప్పింది. దాంతో మలిసగంపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దానికి తోడు తొలిసగంలో దర్శకుడు కొన్ని లీడ్ లు కూడా ఇచ్చాడు. 

ఆ..ఇంకేముంది..అనుష్కను, రానా, ప్రభాస్ ఇద్దరూ ప్రేమిస్తారు..కానీ అనుష్క, ప్రభాస్ నే వరిస్తుంది. దీంతో రానా కుట్ర చేసి ప్రభాస్ ను చంపేస్తాడు..ఈ సంగతి తెలిసి జూనియర్ ప్రభాస్, తమన్నా, బృందం రానా మీదకు దాడికి వెళ్తారు..దాంతో మళ్లీ వార్. ఈసారి ప్రభాస్ గెలుస్తాడు..ఇదీ జనాల ఆలోచన.

కానీ రాజమౌళి వ్యవహారం వేరే వుంటుంది కదా..జనాలకు అతీతంగా ఆలోచించే డైరక్టర్ కదా.  మొదట్నించీ ప్రభాస్ కు అనుకూలంగా వుంటూ వస్తున్న శివగామి(రమ్యకృష్ణ) ద్వితయార్థంలో విలన్ గా మారుతుందని అంటున్నారు. చివర్లో పశ్చాత్తాపంతో బిడ్డను రక్షిస్తుందట. 

'పరమేశ్వరా, నేను చేసిన పాపాలకు కావాలంటే నన్ను బలితీసుకో, ఈ పిల్లాడిని రక్షించు' అన్న డైలాగు వెనుక పరమార్థం అదే అంటున్నారు. ఎందుకంటే రానా క్యారెక్టర్ రమ్యకృష్ణ కొడుకే కదా. లోకం కోసం ప్రభాస్ పట్ల మంచిగా వున్నట్లు నటించింది తొలి భాగంలో అన్న వైనం వినిపిస్తోంది.

ఇక సీనియర్ ప్రభాస్ క్యారెక్టర్ చాలా క్లాసీగా వుంటుందట. అలాగే అనుష్కతో ప్రేమ తదితర సన్నివేశాలు కూడా అదే రేంజ్ లో వుంటాయట. పైగా అన్నింటికి మించి తొలిసగంలో అంతగా ఉపయోగడపడని భారీ కోట సెట్టింగ్ లు మలిసగంలో ఎక్కువగా కళ్ల ముందు వుంటాయంటున్నారు.

మొత్తానికి ఇప్పటి నుంచి ఇలా అలా, అలా ప్రారంభమై, ఆ సినిమా విడుదల నాటికి కూడా ఇప్పటిలాగే భయంకరమైన హైప్ వచ్చేలాగే కనిపిస్తోంది.