ఈవారం వచ్చిన చిన్న చిత్రాల్లో ఏదీ ప్రేక్షక జన రంజకంగా లేకపోవడంతో దేనికీ సరైన వసూళ్లు లేవు. వచ్చిన వాటిలో దేనికీ కనీస ఆకర్షణలు లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయాయి. దీనికి తోడు గత వారం విడుదలైన ‘రభస’ అంతంత మాత్రంగానే ఆడుతుండడంతో బాక్సాఫీస్ వద్ద సందడి లేకుండా పోయింది.
పవర్ రిలీజ్ అయి ఉంటే బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉండేది. అది వాయిదా పడడం, మార్కెట్లో ఉన్న హిట్ సినిమాలు గీతాంజలి, లవర్స్ పాతబడిపోవడం… రభసకి ఫ్లాప్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ సినిమా బిజినెస్‌పై బాగా కనిపిస్తోంది. వీకెండ్లోనే ఇలాగుంటే ఇక సోమవారం నుంచి గురువారం వరకు పరిస్థితి ఇంకెలాగుంటుందో?
కాకపోతే ఈ శుక్రవారం పవర్, అటు పైవారం ఆగడు రిలీజ్ అవుతున్నాయి కనుక బెంగ పడాల్సిన పని లేదు. దసరా, దీపావళి సీజన్ వరకు బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలకి లోటుండదు.