సమంత అక్కడ సెటిలైనట్టే

తమిళంలో తను నటించిన సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్టే టపా కట్టేస్తున్నాయని తెగ బాధ పడిపోయేది సమంత. అయితే ఆమె లోటు మొత్తం ఒకటే సినిమా తీర్చేసింది. కత్తి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సమంతకి…

తమిళంలో తను నటించిన సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్టే టపా కట్టేస్తున్నాయని తెగ బాధ పడిపోయేది సమంత. అయితే ఆమె లోటు మొత్తం ఒకటే సినిమా తీర్చేసింది. కత్తి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సమంతకి సొంత రాష్ట్రంలో హిట్టు లేదనే కొరత తీరిపోయింది. కత్తి సినిమాలో తన పాత్ర పెద్దగా లేకపోయినా హీరోయిన్‌ మాత్రం తనే కాబట్టి ఆ సక్సెస్‌లో సమంతకీ షేర్‌ ఉంటుంది. 

తెలుగులో వరుసపెట్టి తగిలిన ఫ్లాపుల వల్ల సమంతకి ఇక్కడ అవకాశాలు బాగా తగ్గాయి. త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ నటిస్తోన్న సినిమా తప్ప తెలుగులో సమంతకి మరోటి లేదు. ఇలాంటి టైమ్‌లో ఆమెకి కత్తి విజయం కలిసొచ్చింది. అది కానీ ఫ్లాప్‌ అయి ఉంటే సమంతపై పర్మినెంట్‌గా ఐరెన్‌లెగ్‌ ముద్ర పడి తమిళంలో ఇక అవకాశాలు వచ్చి ఉండేవి కాదేమో. 

ప్రస్తుతం విక్రమ్‌తో ఒక సినిమా చేస్తోన్న సమంత తన తదుపరి తమిళ చిత్రంలో ధనుష్‌ సరసన నటిస్తుంది. అమీ జాక్సన్‌తో పాటు సమంత కూడా ఇందులో హీరోయిన్‌ రోల్‌ దక్కించుకుంది. విఐపి దర్శకుడు డైరెక్ట్‌ చేసే ఈ చిత్రంపై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వరుసగా క్రేజీ కోలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ దక్కించుకుంటోన్న సమంత ఇక అక్కడ సెటిలైపోయినట్టే.