మహేష్ బాబుకు అర్జెంట్ గా అత్త కావాలట. అంతటి సూపర్ స్టార్ కు అత్త అంటే సాదా సీదా నటి సరిపోతుందా? మొన్నటికి మొన్న పవర్ స్టార్ అత్త అంటేనే నదియాను వెదికి తెచ్చారు. అదరగొట్టేసింది. ఇప్పుడు ఆమెనే పెడదామనుకున్నారు ముందు. మళ్లీ మరేమయిందో మనసు మారినట్లుంది, వేరే నటి కోసం చూస్తున్నారు అని టాక్.
Advertisement
కొరటాల శివ, మహేష్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమాలో అత్త క్యారెక్టర్ కు కాస్త ప్రాధాన్యత వుందట. అందుకే సరైన సీనియర్ నటిని ఎవరా అని వెదుకుతున్నారట. మరి ఎవర్ని వరిస్తుందో ఆ ఆదృష్టం. ఆంటీలైపోయిన హీరోయిన్లు చాలా మందే వున్నారు మన దగ్గర మరి.