బాహుబలి టెన్షనంతా ఎగ్జిబిటర్లదే?

భారీ ఆదాయం సమకూర్చుకునే విషయంలో బాహుబలి బయ్యర్లు, దాదాపు నూరు శాతం థియేటర్లలో సినిమాను విడుదల చేయడం అనే స్ట్రాటజీని తీసుకున్నారు. అయితే దీని విధివిధానాలు రకరకాలుగా వున్నాయి. కొందరు థియేటర్ల దగ్గర అడ్వాన్స్…

భారీ ఆదాయం సమకూర్చుకునే విషయంలో బాహుబలి బయ్యర్లు, దాదాపు నూరు శాతం థియేటర్లలో సినిమాను విడుదల చేయడం అనే స్ట్రాటజీని తీసుకున్నారు. అయితే దీని విధివిధానాలు రకరకాలుగా వున్నాయి. కొందరు థియేటర్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. ఇది ఎప్పుడూ వుండే పద్దతే. మరి కొందరు కొత్త పద్దతులు పాటిస్తున్నారు. అందులో ఒకటి. సినిమా వేస్తున్న థియేటర్ మూడు రోజుల పాటు అన్ని ఆటలు ఫుల్ అయితే ఎంత షేర్ వస్తుందో, అంత మొత్తం నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ గా తీసుకుని సినిమా ఇస్తున్నారు. 

ఇంకో పద్దతి ఏమిటంటే, వారం రోజుల పాటు ఆ థియేటర్ హయ్యస్ట్ షేర్ ఎంత అయితే అంత తీసుకుని సినిమా ఇవ్వడం. ఒక విషయంలో బాహుబలి ఇప్పటికే రికార్డు సాధించింది. అదేమిటంటే..ఇప్పటి వరకు తీసుకుంటే, తీసుకోండి…లేకుంటే లేదు..అని తెగేసి చెప్పి సినిమాను ఇస్తున్న వైనం ఇదే. పెద్ద స్టార్లు, పెద్ద సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటికి కాస్త అటు ఇటుగా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు కాస్త బేరసారాలు సాగించి, ఓ పాయింట్ దగ్గర ఫిక్స్ కావడం కామన్. కానీ బాహుబలి దగ్గర బయ్యర్లు రెండో మాటకు చాన్సివ్వడం లేదు. పైగా దాదాపు 99శాతం థియేటర్లలో ఒకే సినిమా అన్నది ఇంతవరకు లేదు.

కానీ ఇప్పుడు ఈ బయ్యర్ల డిమాండ్..ఈ తొంభై తొమ్మిదిశాతం థియేటర్లలో విడుదల అన్నది సింక్రనైజ్ అవుతుందా అన్నదే ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా తొలిరోజుల్లో సినిమా చూసేయాలన్న ఆలోచన వున్న ఆఢియన్స్ ఫిక్స్ డ్ గావుంటారు. ఎంత హైప్ తీసుకువచ్చినా, ఆ సినిమా చూడాలి అనే వారి సంఖ్య పెరగవచ్చు కానీ, తొలి రోజుల్లోనే చూసేయాలన్న ఆలోచన వున్న వారి సంఖ్య మరీ భయంకరంగా పెరిగిపోదు. భారీ సినిమాలకు సాధారణంగా యాభై నుంచి డెభై అయిదు శాతం థియేటర్లలో సినిమాలు విడుదల చేయడం కామన్. అప్పుడు మరీ హెవీ రిటర్న్ వుండవు కానీ, వుంటే కొద్దిగా వుంటాయి. 

మరి థియేటర్ మూడు రోజుల పాటు ఫుల్ అయితే వచ్చే షేర్ ను వసూలు చేసి,  దాదాపు అన్ని ధియేటర్లలో ఒకటే సినిమా ఇచ్చినపుడు రిటర్న్ లు వుంటాయా? ఇప్పుడు వినిపిస్తున్న అన్ని టికెట్ లు అమ్మకాలు అయిపోయాయి. ఇంకేం లేవు అన్నది అంతా అవాస్తవం అని అందరికీ తెలుసు. కనీసం పాతికశాతం టికెట్ లు బ్లాక్ కోసం వెనక్కు వుంచేస్తారన్నది అందరూ అనుకునే వాస్తవం. ఎందుకంటే అది ఎవరితో పంచుకోకుండా నేరుగా థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయం. 

కానీ టికెట్ రేట్లు పెంచేసి, బ్లాక్ చేయడం వల్ల, హైప్ కారణంగా ఎవరైతే ఇళ్లలోంచి థియేటర్ కు వస్తారని అంచనా వేస్తున్నారో వారు, ఈ తొలి రోజుల్లో రారు.  తగ్గాక చూడొచ్చులే అనుకుంటారు. అది కామన్ మాన్ సైకాలజీ. దీంతో 99శాతం థియేటర్లకు సరిపడా క్రౌడ్ లేకుంటే, సినిమాలు ఎనభై శాతం, తొంభై శాతం ఫుల్ అయినా, థియేటర్ కు నష్టమే. ఎందుకంటే వారు మూడు రోజుల ఫుల్ షేర్ కు డబ్బులు కట్టేస్తారు కాబట్టి. 

మరో పక్క సినిమాకు ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా ఫ్రభావం అంతో ఇంతో వుంటుంది. అది కూడా థియేటర్లకు నష్టం చేకూరుస్తుంది… వంద కోట్లుకు పైగా పెట్టుబడి పెట్టిన  నిర్మాతలు కావచ్చు, వారి వెనుక వుంటే బినామీలు కావచ్చు సేఫ్…. కొన్న బయ్యర్లు సేఫ్. మారు బేరాలు ఓకె… మిగిలిన టెన్షనంతా ఇప్పుడు ఎగ్జిబిటర్లు అనే థియేటర్ల ఓనర్లదే.