40 నిమిషాలు లేపేశారట

ముకుంద‌కు తొలి రోజు మూడున్నర కోట్లు క‌లెక్షన్లు వ‌చ్చాయంటున్నారు. బాగానే ఉంది. అయితే ఇది నిల‌బ‌డుతుందా అనేది బిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న‌. క్రిస్మస్‌, శ‌ని ఆదివారాలు క‌లిసొస్తే ఏదో కొద్దిలో కొంత తేరుకుంటుంది. సెకండాఫ్‌లో…

ముకుంద‌కు తొలి రోజు మూడున్నర కోట్లు క‌లెక్షన్లు వ‌చ్చాయంటున్నారు. బాగానే ఉంది. అయితే ఇది నిల‌బ‌డుతుందా అనేది బిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న‌. క్రిస్మస్‌, శ‌ని ఆదివారాలు క‌లిసొస్తే ఏదో కొద్దిలో కొంత తేరుకుంటుంది. సెకండాఫ్‌లో లింకులు కొన్ని మిస్సయ్యాయ‌ని విమ‌ర్శకులు తేల్చేశారు. ఆ త‌ప్పు మాత్రం శ్రీ‌కాంత్ అడ్డాల‌ది కాద‌ట‌. 

సినిమా మొత్తమ్మీద 40 నిమిషాలు క‌ట్ చేసుకొంటూ వెళ్లిపోయార‌ని, చివ‌రి క్షణాల్లో క‌టింగులు ఎక్కువై లింగులు క‌రువ‌య్యాయ‌ని టాక్‌.  మెగా ఫ్యామిలీ, నిర్మాత ఠాగూర్ మ‌ధు క‌లిసి… ట్రిమ్ చేసేశార‌ట‌. అందుకే.. లింకులు తెగిపోయాట‌. 

శ్రీ‌కాంత్ అడ్డాల ఈ సినిమాని మ‌రీ చాద‌స్తంగా తీశార‌ని టోట‌ల్  మూడు గంట‌ల‌పై పైనే ఫుటేజ్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఆ మూడుగంట‌లూ యాజ్ టీజ్‌గా చూపిస్తే ముకుంద కాస్త గోవిందా అయిపోదును..!