మొత్తానికి అనుకున్నట్లే అయింది. పవర్ విడుదల వారం పాటు వాయిదా పడినట్లే. డిస్టిబ్యూటర్లు వాయిదా కోరుతున్నట్లు 'గ్రేట్ ఆంధ్ర' ముందే ప్రకటించింది. ఇప్పుడు సెన్సారు సాకు చెబుతూ పవర్ 12 కు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. వీటన్నింటి వెనకు నిర్మాత, పంపిణీ దారు దిల్ రాజు వున్నట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. నైజాం, విశాఖ ప్రాంతాలు రెండింటికీ దిల్ రాజు పంపిణీదారు. ఇటు రభసకు అటు పవర్ కు కూడా. రభస కలెక్షన్లు సోమవారం నాటికి భారీగా పడిపోయాయి. ఇప్పుడు మరో మూడు రోజుల్లో పవర్ వస్తే, పరిస్థితి దారుణంగా వుంటుంది. అందుకే వాయిదా వేయించి, కనీసం కొన్న డబ్బులు రప్పించాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది.
ఇదిలా వుంటే పవర్ లాస్ట్ మినిట్ లో వాయిదా పడడం వల్ల చాలా సినిమాలు ఇబ్బంది పడతాయి. రభస, పవర్, వున్నాయనే ప్రెస్ నోట్ ఇచ్చి కూడా ఒక లైలా కోసం ఆగిపోయింది. ఇక 19న ఆగడు వుంది. 1న గోవిందుడు వస్తాడు. ఇలా అన్నీ షెడ్యూలు చేసి వున్నాయి. వాటి తరువాతే మిగిలినవి. ఇలాంటి సమయంలో పవర్ వాయిదా పడడం అంటే ఒక విధంగా ఆ సినిమాకే నష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మంచి టాక్ వున్న సమయంలో రెండు వారాల టైమ వున్నపుడు విడుదల చేయకుండా, ఆగడు ఒక్క వారం దూరంలో వుండగా ప్లాన్ చేయడం అంటే లాభాలు తగ్గించుకోవడమే అవుతుందని అంటున్నారు. పైగా మహేష్ సినిమాను తట్టుకోవడం రవితేజ వల్ల అవుతుందా అన్నది అనుమానం.
అందుకే ఇంకా పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేక, పవర్ టీమ్ రేపు(మంగళవారం) చెపుతాం అంటున్నారు. చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారో.