ఎన్టీఆర్ ఎలా ఓకె అన్నారో?

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో మరో పెద్ద హీరో వ్యవహారాలు ఇమడవు. ఇటు ఫ్యాన్స్ కూడా వాటిని అంతగా ఇష్టపడరు. కానీ అలాంటిది రభుస సినిమాలో ఇలాంటి చిత్రాలు రెండు చోటు చేసుకున్నాయి.  Advertisement…

సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో మరో పెద్ద హీరో వ్యవహారాలు ఇమడవు. ఇటు ఫ్యాన్స్ కూడా వాటిని అంతగా ఇష్టపడరు. కానీ అలాంటిది రభుస సినిమాలో ఇలాంటి చిత్రాలు రెండు చోటు చేసుకున్నాయి. 

రభస సినిమాకు డైలాగులే పెద్ద మైనస్ అని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో బుల్లెట్ డైలాగ్ ఒకటి, దేవుడా అనే ఊతపదం ఒకటి దర్శకుడు కమ్ మాటల రచయిత సంతోష్ ఎందుకు దూర్చినట్లో? బుల్లెట్ చూడ్డానికి చిన్నదిగా వుంటుంది…..అనే డైలాగ్ అత్తారింటికి దారేదిలో పవన్ క్యారెక్టర్ ను ఉద్దేశించి, తాత చెప్పిన డైలాగ్ ను గుర్తుకుతెస్తుంది. 

అలాగే రేసుగ్రరంలో బన్నీ ఊతపదం 'దేవు..డా..'ను కూడా ఈ సినిమాలో ఓ కార్యెక్టర్ చేత వాడించారు. మెగా హీరోలతో సినిమా చేయాలని ప్రయత్నిస్తూ, ఆ దిశగా ఆలోచించి దర్శకుడు వాడితే వాడి వుండొచ్చు కానీ, ఎన్టీఆర్ ఎలా ఓకె అన్నారో?