సినిమాలను ఆడించడం, విజయవంతం చేసుకోవడం కూడా స్ట్రాటజిక్ వ్యవహారంగా మారిపోయింది. అభిమానులను సమావేశ పర్చడం, వారికి హితబోథలుచేయడం, కాస్త కోపరేట్ చేయమని అడగడం వంటివి మామూలైపోయాయి. అందునా ఇలాంటి వ్యవహారాలు మెగాక్యాంప్ లో చాలా ఎక్కువ. తాజగా మెగా క్యాంప్ నుంచి వస్తున్న సినిమా ముకుంద.
చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ తెరంగ్రేటం చేస్తున్న తొలి సినిమా. మామూలుగానే తొలి సినిమా కాబట్టి కాస్త టెన్షన్ వుంటుంది. పైగా మరోసినిమాతో పోటీ అనే సరికి మరీనూ. పైగా మెగా ఫ్యాన్స్ అటు పవన్ ఇటు చిరు వర్గాలుగా చీలిపోయిన తరువాత ఇంకా సమస్య.
అందుకే మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం తన అభిమానుల సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటుచేసారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి వీరాభిమానులు హాజరవుతున్నారు. సినిమాకు కోపరేట్ చేయాలని చిరంజీవి ఈ సమావేశంలో అభిమానులకు కోరతారని తెలుస్తోంది.