రభస సినిమా ప్రారంభమైన క్షణం నుంచి దానిపై రకరకాల వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. ఆఖరికి విడుదల ముందు రోజు కూడా బకాయిల విషయడమై గడబిడ జరుగుతోందని, విడుదల డౌటన్న రేంజ్ లో కబుర్లు వినిపించాయి. ఇప్పుడు సినిమా విడుదలైంది..ఏవరేజ్ టాక్ ను తెచ్చుకుంది. అయినా కూడా ఇంకా కృష్ణ నగర్ లో ఈ సినిమాపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా విడుదలైన తరువాత నిర్మాత బెల్లంకొండ ఎవరికీ అందులో లేకుండా వున్నారని ఒక టాక్. ఇంకా పలువురికి భారీగా బకాయిలున్నారని ఇంకో వార్త. సాధారణంగా తన సినిమాలు బాగుంది అన్న ఐడియా వుంటే విడుదలకు ముందు కొన్ని మీడియాలకైనా ఎన్టీఆర్ ఇంటర్వూలు ఇవ్వడం రివాజు. కానీ ఈసారి అలా ఇవ్వలేదు. అంటే, రిజల్ట్ ఆయనకు ముందే తెలుసు అని ఓ టాక్. ఇక సినిమా కథ ఇది కాదని.
అసలు కథను ఎన్టీఆరే స్వయంగా అటు ఇటు మార్చారని, ముఖ్యంగా కథలో బృందావనం ఛాయలన్నీ ఎన్టీఆర్ స్వయంగా కూర్చినవి అని మరో డిస్కషన్. సినిమా నిడివి ఇంకా పెద్దగా వచ్చిందని, చాలా వరకు ఎడిట్ చేసారని, ఈ వ్యవహారంలో చాలా మంది దూరడంతో సినిమా తొలి సగానికి తొలిసగం,మలి సగానికి మలి సగం అన్నట్లు తయారైందని, ప్రణీత పాత్ర ఇంకా వుందని, కానీ ఎడిటింగ్ లో ఎగిరిందని కూడా కృష్ణ నగర్ లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.