వరుసగా మూడు సార్లు హీరోయిన్ గా

ఒకే హీరో హీరోయిన్లు జంటగా సినిమా రావడం పెద్ద విషయం కాదు. హిట్ పెయిర్ అనిపించుకుంటే ఇలా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఇలా జరగడం కూడా అరుదుగా జరుగుతూనే వుంటుంది. వరుసగా రెండు…

ఒకే హీరో హీరోయిన్లు జంటగా సినిమా రావడం పెద్ద విషయం కాదు. హిట్ పెయిర్ అనిపించుకుంటే ఇలా జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఇలా జరగడం కూడా అరుదుగా జరుగుతూనే వుంటుంది. వరుసగా రెండు సినిమాల్లో ఒకే హీరొ హీరోయిన్ నటించడం అన్న మాట. అలా కాకుండా వరుసగా మూడు సినిమాల్లో అంటే అది స్పెషల్ న్యూస్ నే .

కంచె సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్. కెరీర్ మరీ అద్భుతంగా ఏమీ ముందుకు సాగలేదు. అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించి మంచి హిట్ కొట్టింది. ఆ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ప్రగ్యా జైస్వాల్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరిది హీరోయిన్ పాత్ర కాదు. శ్రద్ద శ్రీనాద్, ప్రగ్యా లది హీరోయిన్ పాత్రలు. బాలయ్య రెండు గెటప్ లు. అందులో ఒక గెటప్ పక్కన ప్రగ్యా నటిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత బాలయ్య అఖండ 2 చేయబోతున్నారు. అందులో ఎలాగూ ప్రగ్యానే వుండాలి. ఎందుకంటే సీక్వెల్ కనుక ఆమె వుండాల్సిందే. అంటే వరుసగా మూడు సినిమాలు అన్నమాట. బాలయ్య లాంటి మాస్ హీరో పక్కన వరుసగా మూడు సినిమాలు అంటే లక్కీ చాన్స్ అన్న మాటేగా.