Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముసలోళ్లే కానీ మహానుభావులు

ముసలోళ్లే కానీ మహానుభావులు

ఆయన ఓ వయసు మీద పడుతున్న నిర్మాత. కానీ చింత చచ్చినా పులుపు చావదు కదా. అందువల్ల వయసు మీద పడుతున్నా కోరికలు ఎక్కడికి పోతాయి. పైగా చాలా వ్యాపారాలు, బోలెడు డబ్బు. అందుకే ఓ చిన్న నటిని తీసుకుని ముంబాయి వెళ్లిపోయారు. ఆ నటి సినిమాల్లో కాస్త గుర్తుండే క్యారెక్టర్లే చేస్తుంటుంది. పైగా విలక్షణమైన స్వరంతో జనాలకు గుర్తుండిపోతుంది. ఈ నిర్మాత.. ఆ నటి కలిసి ముంబాయిలో తేలారు.

నిజానికి ఎవరికీ తెలియకపోను.. ఇటీవల మన సినిమా జనాలు ఏదో ఒక ప్రమోషన్ కోసం ముంబాయి ఇలా వెళ్లి అలా వస్తున్నారు. దాంతో అక్కడ ఈ నిర్మాతను, ఆ నటిని చూసి చెవులు కొరుకున్నారు. ఆ కొరుకుడు ఇక్కడ టాలీవుడ్ లో రీసౌండ్ ఇచ్చింది.

ఇదిలా వుంటే మరో నిర్మాత వున్నారు. ఆయనది కూడా చిన్న వయసు ఏమీ కాదు. కానీ కాస్త కళాపోసన ఎక్కువ. తరచు పక్క దేశానికి వెళ్తుండడం, అక్కడ ‘సేద’ తీరి రావడం అలవాటు. లేటెస్ట్ గా న్యూ ఇయర్ కోసం ఇలాగే వెళ్లిపోయారట పక్కనే వున్న చిన్న దేశానికి. ఇక్కడ ఏర్పాట్లు భలే చిత్రంగా వుంటాయట. అస్సలు ఈ నిర్మాతతో సంబంధం లేకుండా అన్నట్లు కావాల్సిన జూనియర్ ఎవరో ఒకరు తన అంతంట తాను టికెట్ వేసుకుని, అదే హోటల్ లో రూమ్ వేసుకుని వెళ్లిపోతారు. ఈయన తనంతట తాను వెళ్తారు. సరదాగా గడిపేసాక, మళ్లీ సేమ్ ప్రాసెస్ లో రిటర్న్ అన్నమాట.

ఏం చేస్తాం.. ఎవరి బాధలు వారివి. డబ్బుంది.. పిలిస్తే పలికే వారున్నారు. మధ్యలో మనకెందుకు అంటారా? అయితే ఓకె.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?