Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పీఆర్వో లను వాడుకుంటున్న దర్శకుడు

పీఆర్వో లను వాడుకుంటున్న దర్శకుడు

సాధారణంగా పీఆర్వోలు అంటే సినిమాలను, హీరోలను కాస్త ప్రమోట్ చేస్తారు. హీరోలు తమ సినిమాలకు పీఆర్వోలను రికమెండ్ చేయడం కామన్. అయితే ఓ దర్శకుడు ఇప్పుడు తన సినిమా ఇప్పిస్తా అని చెప్పి పీఆర్వోలను వాడేసుకునేందుకు చూస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదైనా అకేషన్ లోనో, ఎన్నిక‌ల‌ టైమ్ లోనో తను వేసే ట్వీట్ లను మీడియా గ్రూపుల్లో వేసి ప్రమోట్ చేయమని, లేదా తమకు తెలిసిన వెబ్ సైట్లలో తనకు అనుకూలంగా వార్తలు రాయించమని కోరుతున్నాడట. అలా చేస్తే, తాను చేసే సినిమాలకు పీఆర్ పని వచ్చేలా చేస్తాడని పాపం, పీఆర్వోలు ఒకరిద్దరు నమ్ముతున్నారట.

అయితే ఒకరికి తెలియకుండా ఒకరిని అన్నట్లు మొత్తం ముగ్గురు పీఆర్వోలను లైన్ లో పెట్టారట. ఇది చాలదన్నట్లు ఓ సోషల్ మీడియా ఏజెన్సీని కూడా లైన్ లో వుంచారట. కానీ మెల్లగా ఈ సంగతి ముగ్గురికీ తెలిసిపోయింది. దాంతో ఓహో ఇదా గేమ్.. గడ్డి మేటు చూపించిన నడిపించేద్దాం అనుకుంటున్నారా? అని సైలంట్ అయ్యారట. సినిమా ఎవరు చేస్తే వాళ్లు చూసుకుంటారు అని మిగిలిన ఇద్దరూ సైలంట్ అయ్యారట.

పీఆర్ ల మధ్య, జర్నలిస్ట్ ల మధ్య వున్న కాంపిటీషన్ ను ఇలా వాడేసుకుందామనుకుంటున్నారు అని ఒకరికి ఒకరు చెప్పి, నవ్వుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?