Advertisement

Advertisement


Home > Movies - Movie News

బడ్జెట్ కంట్రోల్‌లో వుండాల్సిందే

బడ్జెట్ కంట్రోల్‌లో వుండాల్సిందే

ప్రొడ్యూసర్ అనేవాడు బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టి సినిమా చేయాలని, కచ్చితంగా గీత గీసి సినిమా చేసే పని అయితేనే చేయాలని లేదంటే చేయకూడదని నిర్మాత మహేంద్రనాథ్ చెబుతున్నారు. క్యారెక్టర్ ఆరిస్టుగా, కథానాయికగా డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా 'శబరి' సినిమాను నిర్మించారు మహేంద్రనాధ్. నిర్మాతగా మహేంద్రనాథ్ మొదటి సినిమా ఇది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. 

నిర్మాతగా ఫస్ట్ ఫిల్మ్ ఐదు భాషల్లో చేయడం కొంచెం రిస్క్ అనిపించినా ధైర్యంగా ముందడుగు వేశానని, రిస్క్ తీసుకునే నైజం తనకు ముందు నుంచి ఉందని మహేంద్రనాథ్ చెప్పారు. అమెరికాలో ఉద్యోగం, తర్వాత వ్యాపారాలు చేసి చిన్నతనం నుంచి సినిమాపై ప్రేమ ఉండటంతో 'శబరి'తో నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ 'శబరి' కథ ఓకే చేయడంతో తాను ప్రొడ్యూస్ చేయడానికి ఓ అడుగు ముందుకు వేశానని, ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినప్పటికీ ఒక్కసారి దిగిన తర్వాత వెనకడుగు వేయకూడదని ఆయన వివరించారు.

మదర్ అండ్ డాటర్ ఎమోషన్ గానీ, సెంటిమెంట్ గానీ ఎప్పటికీ ఓల్డ్ అవ్వవని... 'శబరి'లో తల్లీబిడ్డల మధ్య అనుబంధం కొత్తగా చూపించామని ప్రొడ్యూసర్ చెబుతున్నారు. మదర్ ఎమోషన్ నేపథ్యంలో తీసిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా 'శబరి' అని, అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి సినిమా 'శబరి' విడుదలకు ముందు మరో రెండు సినిమాలు స్టార్ట్ చేశారు మహేంద్రనాథ్. వరుణ్ సందేశ్ హీరోగా ఒక సినిమా, 'బిగ్ బాస్' అమర్ దీప్ - సురేఖా వాణి కుమార్తె సుప్రీత జంటగా మరో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?