Advertisement

Advertisement


Home > Movies - Movie News

'క' అంటున్న కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం తాజా చిత్రానికి 'క' అనే టైటిల్ పెట్టినట్టు ఇంతకుముందే గ్రేట్ ఆంధ్ర ప్రకటించింది. ఇప్పుడు అదే టైటిల్ తో సినిమాను ఎనౌన్స్ చేశాడు ఈ హీరో. అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. అంతేకాదు, అతడికి తొలి పీరియాడిక్ మూవీ కూడా ఇదే.

థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సినిమాకు సంబంధించి పేరు మాత్రమే వెల్లడించారు. హీరో ఫస్ట్ లుక్ రివీల్ చేయలేదు. ఇందులో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు కిరణ్.

శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ హీరో, చిన్న గ్యాప్ ఇచ్చి ఈ సినిమాను సిద్ధం చేస్తున్నాడు.

శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో సుజీత్-సందీప్ దర్శకులుగా పరిచయమౌతున్నారు. దక్షిణాది భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. 

 


  • Advertisement
    
  • Advertisement