Advertisement

Advertisement


Home > Movies - Movie News

పోస్టర్ పై క్లారిటీ ఇచ్చిన ట్రయిలర్

పోస్టర్ పై క్లారిటీ ఇచ్చిన ట్రయిలర్

కొన్నాళ్ల కిందటి సంగతి. లవ్ గురు సినిమా నుంచి మాంఛి రొమాంటిక్ పోస్టర్ రిలీజైంది. శోభనం గదిలో మంచంపై హీరోహీరోయిన్లు కూర్చుంటారు. పెళ్లికూతురు గెటప్ లో ఉన్న హీరోయిన్, మద్యం సీసా తీసుకొని, గ్లాసులో పోసే సన్నివేశాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజ్ చేశారు. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రయిలర్ లో అప్పటి పోస్టర్ కు సంబంధించిన క్లారిటీ ఇచ్చారు.

ట్రయిలర్ లో ఓ సన్నివేశంలో, హీరోయిన్ హీరోకు ఫోన్ చేసి మందు కొట్టాలి, కొనుక్కొని రమ్మంటుంది. దానికి హీరో ఓకే అంటాడు. పోస్టర్ కు కొనసాగింపుగా ఈ సీన్ పెట్టినట్టు అర్థమౌతుంది. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.

సినిమాలో హీరోది వన్ సైడ్ లవ్. పెద్దల బలవంతం మీద హీరోను పెళ్లాడిన హీరోయిన్, కనీసం తన ఒంటిపై చేయి కూడా వేయనివ్వదు. హీరోయిన్ కు దగ్గరవ్వడానికి హీరో చేసే ప్రయత్నాలతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇలాంటి కథలు మన ఆడియన్స్ కు కొత్త కాదు. తెలుగులో చాలానే వచ్చాయి. ఆమధ్య తమిళ్ లో కూడా రాజా-రాణి అనే మూవీ వచ్చింది. అది తెలుగులో కూడా హిట్టయింది. ఇప్పటివరకు అలా వచ్చిన సినిమాలతో పోలిస్తే, లవ్ గురు చిత్రం ఎంత భిన్నంగా ఉందనే అంశంపై ఈ సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.

కెరీర్ లో ఫస్ట్ టైమ్ విజయ్ ఆంటోనీ తన శైలికి భిన్నంగా సెలక్ట్ చేసుకున్న కథ ఇది. టఫ్ ఉమెన్ గా మృణాళిని రవి పాత్రకు బాగా సూట్ అయింది. యోగిబాబు, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?