Advertisement

Advertisement


Home > Movies - Movie News

రవితేజ‌ హిట్ కొట్టి తీరాల్సిందే

రవితేజ‌ హిట్ కొట్టి తీరాల్సిందే

సీనియర్ హీరో రవితేజ‌ లేటెస్ట్ మూవీ ఢమాకా. నక్కిన త్రినాధరావు దర్శకుడు. ఈ సినిమా కచ్చితంగా గోల్ కొట్టి తీరాల్సిందే. లేదూ అంటే రవితేజ‌ మార్కెట్ కు సమస్యే. లక్కీగా నాన్ థియేటర్ మార్కెట్ తో రవితేజ‌ బండి లాగించుకుంటూ వస్తున్నాడు. కానీ థియేటర్ మార్కెట్ రాను రాను తగ్గిపోతోంది. 

ప్రస్తుతం రవితేజ‌ ఆంధ్ర థియేటర్ మార్కెట్ 20 కోట్ల దగ్గర..నైజాం ఆరు కోట్ల దగ్గర వుంది. అయితే నాన్ థియేటర్ మాత్రం సినిమాను బట్టి 40 కోట్ల మేరకు వస్తోంది. అందువల్ల అన్నీ కలిసి పాస్ అవుతోంది సినిమా. కానీ జ‌నాల్లో సినిమాకు మాత్రం ఫ్లాప్ ముద్రే పడుతోంది.

2017 లో రాజా ది గ్రేట్ తరువాత వరుసగా నాలుగు డిజాస్టర్లు. ఆ తరువాత క్రాక్ అనే హిట్ వచ్చింది. మళ్లీ ఆ తరువాత రెండు ఫ్లాపులు. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం 18 కోట్ల రేంజ్ లో వుంది. ఢమాకా ను ఫాలో అవుతూ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మరో థ్రిల్లర్ మూవీ వస్తున్నాయి. ఢమాకా హిట్ కొడితే మార్కెట్ స్టాండ్ అవుతుంది. లేదూ అంటే మరింత కిందకు జారిపోతుంది. కానీ రవితేజ్ గ్రాఫ్ రాజా ది గ్రేట్ ముందు కూడా పెద్దగా లేదు.

అయితే రెండు మూడు ఫ్లాపుల తరువాత ఒక్క హిట్ ఇస్తే చాలు నిర్మాతలు ఎగబడిపోతున్నారు. దాంతో బండి నడిచిపోతోంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. థియేటర్ మార్కెట్ ఒకసారి పడిపోతే లేవడం అంత సులువు కాదు. పైగా నిర్మాణ వ్యయం కూడా బాగా పెరిగిపోయింది. థియేటర్ రెవెన్యూ తగ్గిపోతే రవితేజ‌తో సినిమా వర్కవుట్ కావడం కష్టం అవుతుంది. రెమ్యూనిరేషన్ తో కలిపి 50 నుంచి 60 కోట్లు ఖర్చవుతోంది. ప్రస్తుతానికి అలా అలా బ్రేక్ ఈవెన్ అవుతోంది. 

కానీ సినిమా ఫ్లాప్ అయి, థియేటర్ డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి వస్తే నిర్మాతకు నష్టాలే మిగులుతున్నాయి. ఇకపై థియేటర్ రెవెన్యూ ఇంకా తగ్గితే రవితేజ‌ తన రెమ్యూనిరేషన్ ను వెనక్కు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇలా జ‌రగకుండా మార్కెట్ స్టేబుల్ గా వుండాలంటే ఢమాకా హిట్ కొట్టి తీరాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?