Advertisement

Advertisement


Home > Movies - Movie News

పాత చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్న సమంత

పాత చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్న సమంత

సమంత ఫిట్ గా మారింది. ఫొటో షూట్స్ తో అదరగొడుతోంది. ఆమె ఇప్పుడు తన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ సందర్భంగా గతంలో తను ఎదుర్కొన్న శారీరక కష్టాల్ని, రుగ్మతల్ని మరోసారి గుర్తు చేసుకుంది.

రీసెంట్ గా ఆమె మయొసైటిస్ తో బాధపడిన సంగతి తెలిసిందే. ఓవైపు ఆ బాధలో ఉంటుండగానే, మరోవైపు సిటాడెల్ సిరీస్ లో నటించాల్సి వచ్చింది. షూటింగ్ టైమ్ లో కొన్ని సార్లు తల తిరగడం, మరికొన్నిసార్లు మూర్ఛ పోవడం లాంటివి జరిగాయని, తన హెల్త్ కోచ్ అల్తేష్ కు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తనకు గుర్తులేదని ఆమె చెప్పింది.

నిజానికి మయొసైటిస్ బాధల్ని మళ్లీ గుర్తుచేసుకోవడం సమంతకు ఇష్టం లేదు. అయితే ఇంటర్వ్యూల్లో భాగంగా మీడియా పదేపదే అదే విషయాల్ని అడగడంతో, ఇలా మరోసారి ఆ చేదు జ్ఞాపకాల్ని గుర్తుచేసుకోవాల్సి వస్తుందని తెలిపింది.

తాజాగా ఆమె హాట్ ఫొటోషూట్స్ లో కనిపిస్తోంది. ఆమె బాలీవుడ్ లో స్థిరపడాలని భావిస్తోందట. అందుకే ఇలా హాట్ ఫొటోషూట్స్ రిలీజ్ చేస్తోందని అంటున్నారు చాలామంది. తెలుగులో ఆమె ఇంకా తన కొత్త సినిమాను ప్రకటించలేదు. త్వరలోనే ఓ స్టార్ హీరో సరసన ఆమె హీరోయిన్ గా నటించనుందనే ప్రచారం సాగుతోంది.

Clik Here More Pics

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?