Advertisement

Advertisement


Home > Movies - Movie News

అవును.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంట!

అవును.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంట!

మొన్నటివరకు 'అవును.. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు'.. నిన్నటివరకు 'అవును.. వాళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారట'.. ఇప్పుడు డైలాగ్ మారింది. 'అవును.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారంట'. నటుడు సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారనేది తాజా వార్త. వీళ్లిద్దరూ ఈ వార్తల్ని ఖండించకపోవడం విశేషం.

వనపర్తిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో వీళ్లిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అదితి రావు తాత వనపర్తి సంస్థానానికి ఆఖరి రాజు. 18వ శతాబ్దానికి చెందిన ఈ గుడితో వీళ్లకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే అదితి రావు, ఈ గుడిలోనే సిద్దార్థ్ ను వివాహం చేసుకుంది.

అదితిరావుకు ఇదివరకే పెళ్లయింది. అయితే ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. దీంతో 2012లో ఆమె విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటూ, కెరీర్ కొనసాగిస్తూ వచ్చారు. మహాసముద్రం సినిమా టైమ్ లో సిద్దార్థ్ తో పరిచయం, ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తమ అనుబంధాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు.

అటు సిద్దార్థ్ కు కూడా ఇది తొలి వివాహం కాదు. గతంలో అతడికి కూడా పెళ్లయింది. 2007లో తన భార్యతో సిద్దార్థ్ విడిపోయాడు. ఆ తర్వాత సమంతతో డేటింగ్ చేసినా పెళ్లి వరకు వ్యవహారం వెళ్లలేదు. ఇప్పుడు అదితిని వివాహమాడాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?