Advertisement

Advertisement


Home > Movies - Movie News

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

తన ప్రేమ-పెళ్లి విషయంలో ఆది నుంచి కాస్త గుంభనంగానే ఉంది తాప్సి. తన వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పాలంటూ సూటిగా సోషల్ మీడియాలోనే మీడియాను, నెటిజన్లను ప్రశ్నించిన ఈమె.. అందుకు తగ్గట్టుగానే వ్యవహరించింది. బాయ్ ఫ్రెండ్ మతియాస్ బో ను చడీచప్పుడు కాకుండా పెళ్లాడింది.

కొన్నేళ్లుగా మథియాస్ తో డేటింగ్ లో ఉంది తాప్సి. తను చాలామందితో సన్నిహితంగా ఉన్నప్పటికీ, ఎవ్వరూ తనకు పెద్దగా కనెక్ట్ కాలేదని, మథియాస్ మాత్రం తన మనసుకు నచ్చాడని, అందుకే అతడితో డేటింగ్ స్టార్ట్ చేశానని గతంలో వెల్లడించింది తాప్సి. ఇప్పుడు తన బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.

ఉదయ్ పూర్ లో వీళ్లిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. తాజా సమాచారం ప్రకారం బుధవారం నుంచి పెళ్లి వేడుకలు మొదలై, 3 రోజుల పాటు జరిగాయి. దాదాపు 2 రోజులుగా తాప్సి, సోషల్ మీడియాలో ఇన్-యాక్టివ్ గా ఉంది. అప్పుడే అందరికీ చాలా అనుమానాలొచ్చాయి, ఇప్పుడవే నిజమయ్యాయి.

తన పెళ్లి విషయాన్ని తాప్సి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక ముగిసింది.

2013లో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో తొలిసారి కలుసుకున్నారు తాప్సి-మథియాస్. లక్నోకు చెందిన టీమ్ లో మథియాస్ భాగంగా ఉండగా.. హైదరాబాద్ టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తాప్సి వ్యవహరించింది. అలా పరిచయమైన వీళ్లిద్దరూ ఆ తర్వాత ఏడాదే డేటింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?