Advertisement

Advertisement


Home > Movies - Movie News

త్రివిక్రమ్.. సుకుమార్.. విజయ్.. రామ్ చరణ్

త్రివిక్రమ్.. సుకుమార్.. విజయ్.. రామ్ చరణ్

ఒక్కోసారి ఒక్కో ప్రకటన వస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఒక సినిమా మీద కాదు చాలా సినిమాల మీద. రామ్ చరణ్ తరువాత సినిమా సుకుమార్ తో అనే ప్రకటన వచ్చింది. దీంతో అలాంటి మల్టిపుల్ క్లారిటీ వచ్చేసింది. బుచ్చిబాబు సినిమా తరువాత రామ్ చరణ్ చేసేది సుకుమార్ సినిమానే. అంటే పుష్ప 2 తరువాత సుకుమార్ చేసేది రామ్ చరణ్ సినిమానే. అంటే ఇక ఏ హీరో అయినా సుకుమార్ డేట్ ల కోసం చూడడం కానీ, ఏ దర్శకుడైనా రామ్ చరణ్ డేట్ ల కోసం చూడడం కానీ ఇక ఇప్పట్లో జరిగేది కాదు.

గుంటూరు కారం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ ఖాళీగా వున్నారు. బన్నీతో చేయబోయే సినిమాకు స్క్రిప్ట్ పనిలో వున్నారని టాక్. కానీ పుష్ప 2 తరువాత బన్నీ చేసే సినిమా మాత్రం త్రివిక్రమ్ ది కాకపోవచ్చని టాక్ వుంది. హారిక సంస్థకు రామ్ చరణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయాలని వుంది. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు నిజానికి అనుకుంటే అయ్యేది. ఇప్పటి పరిస్థితి చూస్తే ఇక అది ఇప్పట్లో జరగని పని.

విజయ్ దేవరకొండ- సుకుమార్ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసారు. ఇందుకు గాను భారీ మొత్తం అడ్వాన్స్ గా నిర్మాత నుంచి సుకుమార్ కు అందింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆ సినిమా కూడా వుంటుందా? అన్నది అనుమానమే. ఎందుకంటే ఈ సినిమా అయ్యే సరికే 2026 వస్తుంది. పైగా ఇప్పుడు సుకుమార్ అన్నీ మైత్రీ కే చేస్తున్నారు.

అందువల్ల విజయ్ ఇంకో దర్శకుడిని చూసుకోవాల్సి వుంటుందేమో? అలాగే త్రివిక్రమ్ బన్నీ కాకుండా మరెవరితో సినిమా చేయాలన్నా ఎవ్వరూ రెడీగా లేరు. రామ్ ను తప్పించి. నాని తో అనుకున్నారు, కానీ నాని లైనప్ వేరే వుంది. అందువల్ల బన్నీ వచ్చే వరకు వేచి వుండాలి లేదా, ఎన్నికలు అయ్యాక పవన్ తో చేయాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?