
ప్రతిసారి ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం తటస్థుల ముసుగులో ఉన్న శిఖండిని టీడీపీ తెచ్చుకుని పబ్బం గడుపుకోవడం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల ముంగిట ఓ సినిమా నటుడు టీడీపీ కోసం తెరపై కంటే రియల్ లైఫ్‌లోనే బాగా యాక్ట్ చేశాడనే పేరు తెచ్చుకున్నారు. ఆ శిఖండి ప్రయోగం గత ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆ శిఖండి ఏమయ్యాడో కూడా ఎవరికీ తెలియదు.
తాజాగా టీడీపీ తెచ్చుకున్న శిఖండి చాలా యాక్టీవ్‌గా పని చేస్తోంది. అయితే ఈ శిఖండికి కాస్త న్యాయ శాస్త్ర పరిజ్ఞానం వుండడం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే... తాను అంబేద్కర్ పేరుతో పార్టీ పెట్టుకుని, ఆయన ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఈ శిఖండి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెల్లారిలేచినప్పటి నుంచి ఎల్లో చానళ్లలో సూటు, బూటు, నల్లని కోటు తగిలించుకుని నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటారు.
జగన్ ప్రభుత్వం రాజధానిలో 50 వేలకు పైగా కుటుంబాలకు నివాస స్థలాలు ఇచ్చేందుకు శరవేగంగా పనులు చేస్తుంటే... అడ్డుకోవాలని టీడీపీ శిఖండి పిలుపునివ్వడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా ఈ శిఖండి తుళ్లూరులో 48 గంటల దీక్షకు పిలుపునివ్వడం విమర్శలకు అవకాశం కల్పించినట్టైంది.
ఇటీవల ఈయన గారు అరెస్ట్ కాగానే, చంద్రబాబునాయుడు, లోకేశ్ తదితరులంతా ట్విటర్ ఎక్కి రంకేలేశారు. తాజాగా మరోసారి సదరు శిఖండిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పేరుకు సొంత పార్టీ పెట్టాడే కానీ, దాని కార్యకర్తలంతా టీడీపీ వారే కావడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుండడంతో ఆ శిఖండికి న్యాయాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకునే గొప్ప అవకాశం కలిగింది. ఇందుకు టీడీపీ తన వంతు సాయం అందిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
టీడీపీ అధికారంలో వున్నప్పుడు పేదలకు సెంటు స్థలం ఇవ్వాలని ఏనాడూ ఈ తటస్థ శిఖండులు నోరు తెరిచిన పాపాన పోలేదు. కనీసం జగన్ సర్కార్ చేసే పనులకు సహకరించకపోయినా, రాక్షసుల్లా అడ్డుకోకపోతే అదే పదివేలని నివాస స్థలాల లబ్ధిదారులు హితవు చెబుతున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా