ఫలితాలకు ముందే ఎమ్మెల్యే అభ్యర్ధికి షాక్!

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన వ్యక్తి భార్యకు ఫలితాలకు ముందే షాక్ తగిలింది. ఆమె ఉద్యోగానికే ఈ ఎన్నికలు ఎసరు పెట్టాయి. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ కూటమి నుంచి…

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన వ్యక్తి భార్యకు ఫలితాలకు ముందే షాక్ తగిలింది. ఆమె ఉద్యోగానికే ఈ ఎన్నికలు ఎసరు పెట్టాయి. గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ కూటమి నుంచి పోటీ చేశారు. ఆయనకు మద్దతుగా ఆయన భార్య లావణ్య ఎన్నికల ప్రచారం చేశారు అన్నదానికి పరిగణనలోకి తీసుకుని ఏయూలో ఆమె చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

ఈ మేరకు ఏయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్లా లావణ్య ఈ నెల 4న తన భర్త టీడీపీ అభ్యర్ధి అయిన శ్రీనివాసరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు అన్న దాని మీదనే ఈ చర్యలు తీసుకున్నారు. దీనికంటే ముందు లావణ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. అందులో ఆమె ఎన్నికల కోడ్ ని పూర్తిగా అతిక్రమించారు అని పేర్కొన్నారు. అయితే దీనిని వివరణ ఇచ్చిన లావణ్య తాను ఎన్నికల ర్యాలీలో పాల్గొనలేదని అక్కడ ఒక మహిళను మాత్రమే కలిశాను అని చెప్పారు.

ఆ నోటీసులకు ఆమె ఇచ్చిన జవాబుకు ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది అన్నది పక్కన పెడితే శాఖాపరమైన చర్యలకు ఏయూ ఉపక్రమించింది. దాంతో ఆమె ఉద్యోగానికే ముప్పు వచ్చింది.

గాజువాకలో టీడీపీ వైసీపీల మధ్య భారీ పోరు సాగింది. ఎవరికి వారుగా ఎత్తులు పై ఎత్తులతో వ్యూహాలతో ముందుకు సాగారు. అయితే ఎన్నికల కోడ్ ని పక్కన పెట్టి భర్త కోసం లావణ్య ప్రచారం చేశారు అన్నదే ఇపుడు ఈ చర్యలు తీసుకోవడానికి కారణం అని అంటున్నారు. దీని మీద టీడీపీ రియాక్షన్ కూడా చూడాలి.