Advertisement

Advertisement


Home > Politics - Andhra

అరె.. బాబు కామెడీ భ‌లేభ‌లే!

అరె.. బాబు కామెడీ భ‌లేభ‌లే!

చంద్ర‌బాబునాయుడు త‌న పార్టీ అభ్య‌ర్థుల‌కు, నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో భారీ డైలాగ్‌లు చెబుతున్నారు. అయితే ఆయ‌న మాట‌ల్లో అతిశ‌యం వుండ‌డంతో అంతా క‌మెడియ‌న్‌గా చూస్తున్నారు. ఇవాళ విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌త్యేకంగా వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

కేంద్రంలో ఎన్డీఏ 400కు పైగా లోక్‌స‌భ స్థానాల్లో గెలుస్తుంద‌న్నారు. అలాగే రాష్ట్రంలో కూట‌మి 160కి పైగా అసెంబ్లీ సీట్ల‌లో గెలుపొందుతుంద‌న్నారు. క‌డ‌ప ఎంపీ సీటును కూడా మ‌న‌మే గెల‌వ‌బోతున్నామంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆ పార్టీ అభ్య‌ర్థి, ఈ పార్టీ అభ్య‌ర్థి అని చూడొద్దని హిత‌వు ప‌లికారు. అంద‌రూ ఎన్డీఏ అభ్య‌ర్థులుగానే భావించాలని చంద్ర‌బాబు కోరారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌స‌భ స్థానాల్లో గెలుపొందింది. వైసీపీకి వ‌చ్చిన సీట్ల‌ను దృష్టిలో పెట్టుకునే, చంద్ర‌బాబు కాస్త ఎక్కువ సంఖ్య‌ను చెప్పారు. మూడు పార్టీల పొత్తు వ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో టికెట్ రాని నేత‌లు కొట్టుకుంటున్నారు. ప‌ర‌స్ప‌రం ఓడించుకునేందుకు క‌త్తులు నూరుతున్నారు. మ‌రీ ముఖ్యంగా బీజేపీతో పొత్తు వ‌ల్ల ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీల ఓట్ల‌న్నీ కూట‌మి పోగొట్టుకుంద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో కూట‌మి విజ‌యావ‌కాశాల‌ను పోగొట్టుకుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌కూడ‌ద‌నే ఆశ‌యంతో పొత్తు కుదుర్చుకున్న‌ప్ప‌టికీ, క్షేత్ర‌స్థాయిలో ఆ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. బాబు చేతిలో మోస‌పోయామ‌నే ఆవేద‌న జ‌నసేన‌, బీజేపీ నేత‌ల్లో వుంది. మూడు పార్టీల మ‌ధ్య ఓట్ల బ‌దిలీ జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని, మ‌ళ్లీ జ‌గ‌నే అధికారంలోకి వ‌స్తార‌ని అంటున్నారు.

పులిని చూసి న‌క్క వాత‌లు పెట్టుకున్న చందంగా... కూట‌మి 160 అసెంబ్లీ సీట్లు సాధిస్తుంద‌ని చంద్ర‌బాబు మాట‌లున్నాయ‌ని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు. చంద్ర‌బాబు కామెడీ చేస్తున్నార‌ని, ఆయ‌న్ను చూస్తే జాలిప‌డాలో, కోప్ప‌డాలో అర్థం కావ‌డం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?