Advertisement

Advertisement


Home > Politics - Andhra

కార్యకర్తల మాటంటే చంద్రబాబుకు చులకనా?

కార్యకర్తల మాటంటే చంద్రబాబుకు చులకనా?

చంద్రబాబునాయుడు మహానాడు వేదికగా బోలెడన్ని హామీలు ప్రకటించేశారు. మహిళలకు వరం.. లాంటి పడికట్టు పదాలను పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చేశారు. ఇక్కడితో తమ పార్టీ గెలిచిపోయినట్లేనని ఆయన అనుకుంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే క్షేత్రస్థాయిలో పనిచేసే పార్టీ కార్యకర్తల నుంచి, గ్రామాల్లో రైతులకు ఉన్న ఇబ్బందులను స్వయంగా గమనిస్తున్న పార్టీ నాయకుల నుంచి వస్తున్న సూచనలను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు.

రాజమండ్రిలో మహానాడు అనంతర కార్యాలన్నింటినీ ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన చంద్రబాబునాయుడు విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. వారు ప్రధానంగా రైతుల సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని సమీక్షించి రైతులు స్వేచ్ఛగా థాన్యం అమ్ముకునే వాతావరణం కల్పించాలని వారు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. 

నిజం చెప్పాలంటే.. ధాన్యం అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు పాలనలో కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. చంద్రబాబునాయుడు కూడా అనేకమార్లు ఆ విషయాలు ప్రస్తావించారు. అయితే కార్యకర్తల కోరికకు ఆయన స్పష్టంగా స్పందించలేదు. రైతులకు మేలు జరిగేలా రెండో మేనిఫెస్టోలో పెడదాం అని మాత్రమే అన్నారు. అంతే తప్ప.. విధానాన్ని సమీక్షించడం గురించి తేల్చలేదు.

అసలే రైతులకు ఒక్కొక్కరికి ఏడాదికి 20 వేల వంతున ఇస్తామని మాట ఇచ్చేశాం. అక్కడికే రైతుల జీవితాలు బాగుపడిపోతాయి.. ఇక ఎరువుల మీద విత్తనాల మీద పన్నుల రూపేణా ఎలా వడ్డించి.. వారికి ఇచ్చే ఇరవై వేల రూపాయలను వెనక్కు దండుకోవాలా? అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారో ఏమో తెలియదు. అందుకే ధాన్యం కొనుగోళ్ల విధానాలపై స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.

అయినా చంద్రబాబునాయుడు కార్యకర్తలు, పార్టీ నాయకులు చెప్పే సలహాలను చెవిన వేసుకోరని, ఎన్నికల వ్యూహకర్తల ముసుగులో కార్పొరేట్ బుద్ధులు నిండిన సలహాదారులు చెప్పే మాటలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తారని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. రైతులపట్ల నిజాయితీతో కూడిన ప్రేమ చంద్రబాబు నుంచి ఆశించడం దండగ అని కూడా పార్టీ నేతలు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?