
1995లో ఎన్టీఆర్‌ను సీఎం సీటు నుంచి గద్దె దింపిన విధానంపై ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకుంటుంటారు. అప్పట్లో చంద్రబాబు పక్షాన చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేలంతా ఆయన వైపు ఉన్నారంటూ పచ్చ పత్రికలు కనికట్టు కథనాలు రాయడం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ వైపు ఉన్నవాళ్లంతా పోలోమని చంద్రబాబు ఉన్న వైశ్రాయ్ హోటల్‌కు పరుగులు పెట్టారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడం సులువైంది.
తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తన మార్క్ రాజకీయానికి తెరలేపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేస్తారనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారానికి ఎల్లో మీడియా సహజంగానే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇది ఎన్టీఆర్ నాటి రాజకీయాలకు సమయం కాదని, టీడీపీ కుట్రలకు కాలం చెల్లిందని వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలవాలంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే మద్దతు అవసరం. దాని కోసం టీడీపీ మైండ్ గేమ్‌కు తెరలేపింది. ఇందులో బాగంగా వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం తమకు ఓట్లు వేస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు , గోరంట్ల బుచ్చయ్య అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలంతా తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఝలక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలా మంది ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు వాదనను తెరపైకి తెచ్చారు.
ఇటీవల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సీఎం జగన్‌లో మార్పు కోసం సొంతవాళ్లే ఓడించారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేల ప్రచారంపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. ఇలా అభూతకల్పనలతో ప్రత్యర్థులను బలహీనపరచడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు. అయితే టీడీపీ ఆటలు ముఖ్యమంత్రి జగన్ దగ్గర సాగవని చెబుతున్నారు. చంద్రబాబు కుట్రలను గుర్తించలేని స్థితిలో నేతలు లేరన్నారు. చంద్రబాబు, ఆయనకు వంత పాడుతున్న నాయకులు, మీడియా సంస్థల రాతలు, మాటల వెనుక దురుద్దేశం ఏంటో జనానికి బాగా తెలుసని వైసీపీ నేతలు, నెటిజన్లు అంటున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా