Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఎంపీ హ్యాట్రిక్ సక్సెస్ డౌట్ లో పడిందా?

ఎంపీ హ్యాట్రిక్ సక్సెస్ డౌట్ లో పడిందా?

ఏపీలో జగన్ వేవ్ లో సైతం టీడీపీ మూడు ఎంపీ సీట్లు గెలిచింది. అందులో శ్రీకాకుళం ఒకటి. 2014, 2019లలో వరసగా ఈ సీటుని కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుచుకున్నారు. ఇపుడు 2024 లో మూడవసారి పోటీ చేస్తున్నారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ సక్సెస్ తనదే అని ఆయన భావిస్తున్నారు.

టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరింది కాబట్టి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో రామ్మోహన్ కి మంత్రి పదవి కూడా వస్తుందని అపుడే అభిమానులు అంచనాకు వస్తున్నారు. ఇంతలోనే జిల్లా పార్టీలో అపశృతులు మొదలయ్యాయి. టికెట్ల వద్ద తేడా వచ్చి ముసలం బయల్దేరింది.

శ్రీకాకుళం ఎంపీ సీటుకు మెజారిటీ అందించే కీలక నియోజకవర్గాలలో టికెట్ల పోరు సాగుతోంది. బలమైన నాయకుడుగా ఉన్న గుండ కుటుంబాన్ని పక్కన పెట్టి టికెట్ దక్కకుండా చేశారు అని అంటున్నారు. ఆయన వర్గం ఇపుడు తీవ్ర అసంతృప్తిలో ఉనారు. ఇండిపెండెంట్ గా గుండ అప్పల సూర్యనారాయణ పోటీ చేస్తే కనుక అది రామ్మోహన్ విజయాన్ని ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు.

శ్రీకాకుళం సీటు కొత్త ముఖం అయిన గోండు శంకర్ కి ఇచ్చారని, ఆయన సీనియర్ నేత మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావుకి గట్టి ఫైట్ ఇవ్వలేరని అంటున్నారు. ఆ విధంగా ధర్మాన ప్రసాదరావుకు భారీ మెజారిటీ వచ్చినా ఎంపీ సీటుకే ముప్పు వస్తుందని అంటున్నారు.

పాతపట్నం విషయంలో గత నాలుగు దశాబ్దాలుగా ఉన్న కలమట కుటుంబాన్ని పక్కన పెట్టి మామిడి గోవిందరావుకు టికెట్ ఇవ్వడం పట్ల కలమట వర్గం రగులుతోంది. ఆయన కూడా రెబెల్ గా రంగంలో ఉంటారని అంటున్నారు. దీంతో శ్రీకాకుళం ఎంపీ సీటులో ఉన్న ఏడు నియోజకవర్గాలలో రెండు టీడీపీకి చిక్కులు తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు.

అలాగే నరసన్న పేట, పలాస, టెక్క్కలి, ఆముదాలవలసలో ఢీ అంటే ఢీగా టీడీపీ వైసీపీల మధ్య పోరు ఉంది. ఇచ్చాపురంలో కూడా ఈసారి పరిస్థితి మారుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ టికెట్ల గొడవ కాస్తా ఎంపీ విజయం మీద కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?