Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీ నాడు వికర్షణ... నేడు ఆకర్షణ

టీడీపీ నాడు వికర్షణ... నేడు ఆకర్షణ

ప్రతీ అయిదేళ్ళకూ రాజకీయ పార్టీలలో ఆకర్షణ వికర్షణలు అలా రాత్రీ పగలు మాదిరిగా మారుతూ ఉంటాయేమో. అధికారమే దానికి కారణం. అది పోతుంది అనుకున్నపుడు ఎంతటి గొప్ప పార్టీ అయినా వికర్షణ మొదలవుతుంది. విరక్తి కలుగుతుంది. అదే అధికారంలోకి వస్తుంది అని అంచనాలు ఏర్పడేసరికి పెద్ద ఎత్తున ఆకర్షణ స్టార్ట్ అవుతుంది. ఇది రాజకీయం మహిమ తప్ప ఏ రాజకీయ పార్టీ అయినా అపుడూ ఇపుడూ ఎపుడూ ఒకేలా ఉంటుంది. ఇది పరమ సత్యం.

సీనియర్ రాజకీయ నేత తలపండిన నాయకుడు మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశానికి ఉన్న ఆకర్షణ శక్తిని గురించి చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సూదంటు రాయిలా అందరినీ ఆకట్టుకుంటోందని గంటా వారు చెబుతున్న మాట. అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా తెలుగుదేశం పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నాయట. తెలుగుదేశం పార్టీదే భవిష్యత్తు అని గంటా అంచనా వేశారు.

వచ్చే ఎన్నికల తరువాత వైసీపీ ఉండదని జోస్యం పలికారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే మూడు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటుని టీడీపీ గెలుచుకుంది. టీడీపీకి వరస విజయాలే అని గంటా సూత్రీకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకు ఎదురులేదని ఎలుగెత్తి చాటుతున్నారు.

నాలుగేళ్లూఅ పార్టీకి గంటా దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. నాడు ఆయన వికర్షించబడి దూరం జరిగి ఉంటారనే ఇపుడు అర్ధం చేసుకోవాలేమో. ఎన్నికల ఏడాది టీడీపీ పుంజుకుంటోందని ఆయన ఆకర్షితులు అయినట్లుగా భావించాలేమో. పాలిటిక్స్ లో ఆకర్షణ ఎపుడు  అధికారం వైపే ఉంటుంది. 

ఎంత తిప్పి తిప్పి చెప్పినా ఎన్ని గొప్పలు చెప్పినా వికర్షణలు ఆకర్షణలు అంటూ అందమైన మాటలు వాడినా గెలిచే పార్టీకే అన్నీ ఉంటాయి. గంటా వరకూ తీసుకుంటే ఆయన గెలిచే పార్టీలో ఉంటారని అంతా అంటూ ఉంటారు. ఇపుడు ఆయనకు టీడీపీ గెలిచే పార్టీగా కనిపిస్తోంది అని అంటున్నారు.

ఈ వికర్షణలు ఆకర్షణలు అన్నీ రాజకీయ నాయకుల లెక్కలు ఎలా ఉన్నా ప్రజలు ఏ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు అన్నది 2024లో తేలుతుంది. జనాలు ఆకర్షించే పార్టీదే జయం. అక్కడే శుభం. అప్పటిదాకా ఇవన్నీ కూడా  అంచనాలుగానే చూడాల్సి ఉంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?