Advertisement

Advertisement


Home > Politics - Andhra

అరకు కాఫీకి అరుదైన గౌరవం

అరకు కాఫీకి అరుదైన గౌరవం

అరకు కాఫీ ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. ఆహా ఏమి రుచి అని విదేశీయులు సైతం లొట్టలు వేస్తున్నారు. అరకు కాఫీ పంట ఇపుడు అధిక లాభాలను గడిస్తోంది. విశాఖ ఏజెన్సీలో అతి పెద్ద వాణిజ్య పంటగా మారిపోయింది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా కాఫీ రైతులు అయిన గిరిజనులు వెలిగిపోతున్నారు.

అరకు కాఫీకి ఇపుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అలా గిరిజన సహకార సంస్థ మరో మైలురాయిని అందుకుంది. గిరిజనులు నుంచి కొనుగోలు చేస్తున్న కాఫీ గింజలు, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ని సాధించడము జరిగినది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అపెడా గిరిజన సహకార సంస్థకు కాఫీ విషయంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది.

విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి డివిజన్ పరిధిలో గల గొందిపాకలు, లంబసింగి , కప్పాలు క్లస్టర్లకు గాను 1300 మందికి పైగా గిరిజన రైతులు సుమారు 21వేల‌ 104 ఎకరాలలో పండిస్తున్న కాఫీ మిరియాలు పంటలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ మంజూరు చేసింది. ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ సంవత్సరముల క్రితమే ప్రారంభించడము జరిగినది. 

ఈ సర్టిఫికేషన్ వలన గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ , మిరియాలకు మరింత అధిక ధర లభించే ఆస్కారం కలుగుతుంది. తద్వారా ఈ కాఫీ రైతులకు ఆర్థిక లబ్ది చేకూరుతుందని అధికార వర్గాలు తెలిపాయి. చింతపల్లి మండలంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన కాఫీ మిరియాల తోటలకి విశిష్ట గుర్తింపు వస్తుంది. అలా గిరిజనులు ఇపుడు ఇంకా కీర్తిమంతులు లక్ష్మీపుత్రులు అయ్యే అవకాశం దక్కింది అని చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?