Advertisement

Advertisement


Home > Politics - Andhra

జనసేనలో టోటల్ గా చేవ చచ్చిందా?

జనసేనలో టోటల్ గా చేవ చచ్చిందా?

జనసేనాని పవన్ కల్యాణ్ కు పార్టీ వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక లేదు.. ఆయన షూటింగులు లేదా ఇతరత్రా వ్యవహారాలతో చాలా బిజీగా గడుపుతున్నారు.. అంటే అర్థం చేసుకోవచ్చు. ఎటూ బందరు సభకోసం రెండు మూడు రోజులు కేటాయించారు గనుక.. కనీసం రెండు మూడు వారాలు, కుదిరితే మరో రెండు మూడు నెలల పాటూ ఆయన మళ్లీ జనం ముందుకు రాకుండా షెల్ లో బతికేసినా.. ఆయన తీరు ఇంతేలే అని అభిమానులు అర్థం చేసుకుంటారు. 

కానీ.. మొత్తంగా జనసేన పార్టీకికూడా చేవ చచ్చిపోయిందా? రాజకీయ కౌంటర్లు ఇచ్చే దమ్ము కోల్పోయారా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఒకవైపు భాజపా మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. పవన్ కల్యాణ్ తీరు మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. పొత్తు ఉందనుకోవడం భ్రమ అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం సహకరించలేదని, ఒకవైపు పీడీఎఫ్ అభ్యర్థి తమకు పవన్ మద్దతు ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉండగా, దానిని ఖండించమని అడిగినా కూడా పవన్ స్పందించలేదని మాధవ్ ఆరోపణలు చేశారు. 

మాధవ్ ఆరోపణలను ఒకవైపు వాళ్ల సొంత పార్టీ నాయకులే ఖండిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటున్నారు. కానీ.. మాధవ్ మాటలను ఖండించడానికి జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్ కు మాత్రం ధైర్యం చాలడం లేదు. 

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ‘‘ప్రధాని మోడీ పట్ల ఉన్న గౌరవం, స్నేహబంధం కారణంగా మేం పొత్తులను గౌరవిస్తూనే ఉన్నాం.. కాదు కూడదు మాకు పొత్తులు అక్కర్లేదు అని వాళ్లు అనుకుంటే అందుకు మాకు అభ్యంతరం లేదు’’ అనే తరహాలో పవన్ కల్యాణ్ నుంచి ఆగ్రహం వ్యక్తం కావాలి. 

ఆయన ఎటొచ్చీ తెగతెంపులు చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు. అందుకు సరైన కారణం కోసం చూస్తున్నారు. సరైన సమయంలో ప్రకటన చేయాలనుకుంటున్నారు. బందరు సభలో చిన్న సంకేతం ఇచ్చారు. అయితే మరోసారి మాధవ్ కు ముడిపెట్టి అలాంటి సంకేతం మరొకటి ఇచ్చి ఉండొచ్చు. కానీ ఏదో భయం వెంటాడుతున్నట్టుగా మౌనంగా ఉండిపోయారు.

ఇలాంటప్పుడు.. పార్టీలో సెకండ్ గ్రేడ్ నాయకులు ఉంటే.. వారు మాధవ్ మాటలను ఎడాపెడా చీల్చి చెండాడేయడం. అడ్డగోలుగా విరుచుకుపడిపోవడం జరుగుతుంది. వారు చెడామడా బిజెపిని తిట్టేసిన తర్వాత.. పవన్ గానీ, నాదెండ్ల గానీ తెరమీదకు వచ్చి.. ఆ తిట్లు మొత్తం వారి వ్యక్తిగతం. పార్టీకి సంబంధం లేదు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కవచ్చు. అలాంటి వ్యూహాన్ని సాధారణంగా పార్టీలు పాటిస్తుంటాయి. 

కానీ పవన్ కల్యాణ్ కాదు కదా.. పార్టీలో ఎవరూ కౌంటర్లు వేయడం లేదు. మొత్తంగా జనసేన పార్టీలో చేవచచ్చిపోయిందా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ఇంతగా మన్నుతిన్నపాములా ఉంటున్నారే.. ఈ విషయంలో కూడా చంద్రబాబునుంచి స్క్రిప్టు వస్తే తప్ప ఒక అడుగు ముందుకు వేయరా? అని జనం నవ్వుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?