Advertisement

Advertisement


Home > Politics - Andhra

‘కమ్మ-కాపు’ బంధంపై భగభగలకు ఇది రుజువు!

‘కమ్మ-కాపు’ బంధంపై భగభగలకు ఇది రుజువు!

మైకు అందుకుని నోరు తెరిస్తే చాలు.. కులాల గురించి తప్ప మరొక మాట మాట్లాడే అలవాటు లేని పవన్ కల్యాణ్ తాజాగా కమ్మ--కాపు బంధం గురించి స్పష్టత ఇచ్చేశారు. 

తాను చంద్రబాబునాయుడు పల్లకీ మోయాలని ఉత్సాహపడుతుండడం మాత్రమే కాదు.. యావత్ కాపు జాతి– కమ్మకులం ఊడిగం చేస్తూ వారి ఉన్నతి కోసం పనిచేయాలని అన్నట్టుగా ఆయన తన పదోవార్షికోత్సవ సందేశం ఇచ్చారు. అందుకోసం వంగవీటి రంగా కమ్మవారి అమ్మాయిని పెళ్లిచేసుకున్న ఉదాహరణ కూడా సెలవిచ్చారు. ఆయన దీని ద్వారా ఏం ఆశించారో గానీ.. ఈ కులబంధం గురించి ప్రవచించిన విశ్వమానవుడి వైఖరి.. సొంత పార్టీలో ముసలం పుట్టిస్తోంది. 

ఆయన కొత్త కులప్రేమలపై ఆగ్రహిస్తున్న కాపు తమ్ముళ్లు తమ సొంతదారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రస్తుతానికి అతీగతీ లేని బిజెపిలోకి వెళ్లడానికైనా సిద్ధపడుతున్నారు గానీ.. జనసేనలో ఉండడానికి మాత్రం ఇష్టపడడం లేదంటే.. పవన్ మాటల మీద ఎంతగా ఆగ్రహావేశాలు ఆ పార్టీలో వ్యక్తం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

విజయవాడలోని ఆకుల కిరణ్ కుమార్ అనే నాయకుడు జనసేన కీలకమైన వ్యక్తుల్లో ఒకరు. జనసేన పార్టీ తరఫున టీవీ డిబేట్లలో పాల్గొనే స్థాయి గల తక్కువ మందిలో ఆయన కూడా ఉంటారు. చాలా మందిలాగా నోరేసుకుని పడిపోవడంలాగా కాకుండా పాయింట్ మాట్లాడతారని కూడా అంటూ ఉంటారు. సదరు ఆకుల కిరణ్ కుమార్.. జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

రాజీనామా చేసిన నాయకుడు అంతకంటె మించిన భవిష్యత్తును కోరుకుంటూ పెద్దపార్టీలోకి వెళ్లారా అంటే.. అదీ లేదు. తమకు రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోగల బలం లేకపోవడం మాత్రమే కాదు.. ఒక్క శాతం ఓటు బ్యాంకుకు కూడా ఠికానా లేదని, నోటాను కోరుకునే కంటె తక్కువమంది మాత్రమే తమను ఆదరిస్తున్నారని.. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో మారు నిరూపించుకున్న  భారతీయ జనతా పార్టీలో ఆకుల కిరణ్ కుమార్ చేరారు. ఈ నిర్ణయం అందరినీ విస్మయపరుస్తోంది.

పవన్ కల్యాణ్ ప్రతిపాదిస్తున్న కమ్మబంధం, కుల సమీకరణలు.. కాపు వర్గానికి ఎంతటి ఆగ్రహం తెప్పిస్తోందో తెలుసుకోవడానికి ఇది ఉదాహరణ. రంగాకు తాను టీ సప్లయి చేశానంటూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి.. ఆయనతో సాన్నిహిత్యాన్ని చాటుకోవాలనుకుంటూ అడ్డంగా దొరికిపోయిన పవన్ కల్యాణ్.. ఆయన కుటుంబం– వివాహం విషయాలు ప్రస్తావించి.. వాటి కారణంగా కాపులందరూ కమ్మవారితో ప్రేమబంధం పెంచుకోవాలని ఉపదేశించడం జనసేన పార్టీకి మరణశాసనం రాసినా ఆశ్చర్యం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. 

ఆకుల కిరణ్ కుమార్ రూపంలో బయటపడిన ఆ ఆగ్రహాన్ని పవన్ కల్యాణ్ ఎంత కాలానికి గుర్తిస్తారో, లేదా గుర్తించనట్టుగా నటిస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?