Advertisement

Advertisement


Home > Politics - Gossip

త్యాగం ఖరీదు పది కోట్లు?

త్యాగం ఖరీదు పది కోట్లు?

రాజకీయాలు భలే చిత్రంగా వున్నాయి ఇప్పుడు. ఈ పార్టీ వాళ్లకు ఆ పార్టీ కండువా కప్పి టికెట్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు అన్ని పార్టీల్లోనూ జోరుగానే వున్నాయి. కానీ కొన్ని సార్లు ఇది కూడా సాధ్యం కావడం లేదు. త్యాగాలు చేయాల్సి వస్తోంది కొందరు. ఇలా త్యాగాలు చేసే వారికి సాధారణంగా హామీలతో కూడిన బుజ్జగింపులు కామన్. ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పోస్టులు ఇలా చాలా వుంటాయి హామీల జాబితాలో.

అయితే అటు పార్టీల నేతలు, ఇటు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇద్దరూ తెలివి మీరిపోయారు ఇప్పుడు. ఏరు దాటాక ఓడ మల్లన్న కాస్తా బోడి మల్లన్న అవుతాడనే భయం వుండనే వుంది. అందుకే హామీతో పాటు ముందుగా ‘మాకేంటీ’ అంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందరికీ కాకపోయినా, కొన్ని చోట్ల ఇలాంటి వాళ్లని డబ్బుతో కొనాల్సి వస్తోందట. అయితే ఈ ఖర్చు పార్టీల ఖాతాల మీద కాకుండా టికెట్ లు తెచ్చుకునే వాళ్ల ఖాతాల మీద పడుతోందట.

ఇలా ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా, లాస్ట్ మినిట్ లో తప్పుకున్న ఓ నేతకు పరిహారంగా పది కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రలో చాలా చోట్ల, టికెట్ రాకున్నా, కోపరేట్ చేస్తున్న వారికి అంతో ఇంతో లభించింది కానీ మరీ పది కోట్లు అన్నది కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే అని తెలుస్తోంది. పది కోట్లు అందుకోవడం వల్ల దానికి తగిన విధంగా మద్దతు ఇస్తూ రుణం తీర్చుకుంటున్నారని టాక్.

ఇదిలా వుంటే ఇదే నియోజకవర్గంలో ఓ కీలక రాజకీయ వేత్త మద్దతు కోసం కూడా మూడు కోట్లు అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు నేత ఇటీవలే పార్టీ మారారు. తాను వచ్చిన పార్టీలోకి తన అనుచర గణాన్ని అంతా తీసుకురావడం, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి వారందరి మద్దతు కూడగట్టడం వంటి వ్యవహారాలకు కట్టిన ఖరీదు ఈ మూడు కోట్లు అని టాక్.

ఏమైనా ఈ పది, మూడు కోట్లు అన్నవి ఆ అభ్యర్ధికి బటానీలతో సమానం అని, వంద కోట్లు ఖర్చు చేసైనా తాను వెదికి వెదికి వచ్చి చేరిన చోట గెలిచి తీరాలని పట్టుదలతో వున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?