Advertisement

Advertisement


Home > Politics - Political News

W.H.O చీఫ్ మ‌రింత నిస్సిగ్గు ప్ర‌క‌ట‌న‌లు!

W.H.O చీఫ్  మ‌రింత నిస్సిగ్గు ప్ర‌క‌ట‌న‌లు!

ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ వ్యాప్తి విష‌యంలో డ‌బ్ల్యూహెచ్ వో పాత్ర తీవ్ర వివాదాస్ప‌దం అయ్యింది. ప్ర‌పంచ దేశాల సొమ్ముల‌తో న‌డిచే ఈ సంస్థ ప్ర‌పంచాన్ని చైనా వైర‌స్ పాల్జేసింద‌నే ఆరోప‌న‌లు తీవ్రంగా వినిపిస్తూ ఉన్నాయి. చైనా అండ‌దండ‌ల‌తో డ‌బ్ల్యూహెచ్వో చీఫ్ అయిన టెడ్రోస్ పూర్తిగా ఆ దేశానికి బానిస‌గా మారాడ‌ని, ఆ దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న వేళ అందుకే ఇత‌డు ప్ర‌పంచ దేశాల‌ను అల‌ర్ట్ చేయ‌లేద‌ని, చైనాల‌తో సంబంధాలు తెంచుకొమ్మ‌ని చెప్ప‌డానికి అత‌డు వెనుకాడాడు అని, చైనాకు బానిసై అత‌డు అలా చేశాడ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

అందుకు డ‌బ్ల్యూహెచ్వో గ‌తంలో చేసిన ట్వీట్లు కూడా ఊతం ఇస్తున్నాయి. క‌రోనా వైర‌స్ మ‌నిషి నుంచి మ‌నిషికి వ్యాపించ‌దు అంటూ గ‌తంలో ఈ సంస్థ ట్వీట్ చేసింది. అలాగే చైనాలో ప‌రిస్థితి ఏమిట‌నేది అంచ‌నా వేయ‌డానికి క‌ద‌ల్లేదు. చైనాతో సంబంధాలు తెంచుకొమ్మ‌ని ప్ర‌పంచానికి చెప్ప‌లేదు. చైనా దుర్మార్గ‌పు వైఖ‌రికి తోడు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దుర్మార్గం... ఇప్పుడు మొత్తం ప్ర‌పంచాన్ని క‌రోనా బారిన ప‌డేలా చేసిందనేది స్ప‌ష్టం అవుతున్న అంశం.

ఈ విష‌యంలో ఇప్ప‌టికే ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. డ‌బ్ల్యూహెచ్వోకు అమెరికా నుంచి అందే నిధుల‌ను ఆపేశాడు. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్వో ముఖ్య ప్ర‌తినిధుల దృష్టి నిధుల మీద‌కు మ‌ళ్లింది! అమెరికా ఆ నిధుల‌ను మ‌ళ్లీ కొన‌సాగించాల‌ని వారు కోరుతున్నారు! ఈ జాబితాలో టెడ్రోస్ కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం! ఇత‌డి దృష్టి నిధుల మీదే ఉన్న‌ట్టుంది. అయితే త‌న దృష్టి క‌రోనాను క‌ట్టడి చేయ‌డం మీదే అని చెప్పుకుంటున్నాడు. కానీ నిధుల గురించి మాట్లాడుతున్నాడు.

ఇత‌డికి డ‌బ్ల్యూహెచ్వో చీఫ్ గా ఉండే అర్హ‌త ఏ మాత్రం లేద‌ని, త‌క్ష‌ణం రాజీనామా చేయాల‌ని కూడా అమెరికన్ ప్ర‌భుత్వ ముఖ్యులు ఇప్ప‌టికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ టెడ్రోస్ ఆ ప‌ద‌విని వదులుకునేలా లేడు, త‌ను క‌రోనా ను నియంత్రించ‌డం మీదే దృష్టి పెట్టిన‌ట్టుగా నిస్సిగ్గు ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటూ ఆ ప‌ద‌విని ప‌ట్టుకుని వేలాడుతూ, ఇప్ప‌టికీ చైనాను వెన‌కేసుకు వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడు.

అందుకే చిరంజీవి మెగాస్టార్ అయింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?