Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆశ్చర్యం.. 'ఈనాడు'లో బాబుకు తగ్గిన ప్రాధాన్యం!

ఆశ్చర్యం.. 'ఈనాడు'లో బాబుకు తగ్గిన ప్రాధాన్యం!

ఏపీలో టీడీపీకి బాకాలూదే మీడియాలో ఈనాడు కూడా ఉంది. కానీ ఏది చేసినా మరీ బయటపడిపోయేట్టు ఉండకపోవడం ఆ సంస్థ స్పెషాలిటీ. ఆంధ్రజ్యోతి, టీవీ-5లాగా అంతా ఒంటికి పూసుకోదు. ఒకవేళ ప్రభుత్వం ఆగ్రహించినా ఆ లిస్ట్ లో లేకుండా తప్పించుకుంటుంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఈనాడు తన పంథా మార్చుకోలేదు. 

ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకునే నిర్ణయాలను లోపలి పేజీల్లో వేసింది. అదే సమయంలో చంద్రబాబు జూమ్ మీటింగ్ పెట్టినా, ట్విట్టర్లో చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా అది బ్యానర్ ఐటమ్ అయ్యేది. చినబాబు సంగతి చెప్పేదేముంది. ఓ దశలో చంద్రబాబు కంటే లోకేష్ కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

రూటు మారుతోంది..?

అలాంటి ఈనాడు క్రమక్రమంగా తన రూటు మార్చుకుంటోంది. కొన్ని రోజులుగా ఈనాడు పంథాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని దారుణాలు ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిగా ఉన్నాయి. ప్రతిపక్షాలు వాటిని బాగా హైలెట్ చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. 

రమ్య హత్య కేసైనా, బాలికతో పోలీస్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన అయినా.. వైసీపీ వ్యతిరేక మీడియా ఓ రేంజ్ లో హైలెట్ చేసింది. లోకేష్ అరెస్ట్ కి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నంత బిల్డప్ ఇచ్చాయి. కానీ ఈనాడు ఆ జోలికి వెళ్లకపోవడం విచిత్రం.

రమ్య కుటుంబాన్ని పరామర్శించిన వ్యవహారంలో లోకేష్ కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతే ఇచ్చారు. అనవసరపు బిల్డప్ ఇవ్వలేదు. మరోవైపు టీడీపీ నేతలు చేస్తున్న ఆందోళనలకు కానీ, చంద్రబాబు ప్రెస్ నోట్లకి కానీ పెద్దగా ప్రయారిటీ దక్కడంలేదు. ప్రతిరోజూ బ్యానర్ లో కనిపించే బాబు, లోపలి పేజీల్లోకి వెళ్లిపోయారు. అదే సమయంలో జగన్ కి ప్రయారిటీ పెరిగింది. 

ఈనాడు పేజీల్లో జగన్ ముందు వరుసలోకి వస్తున్నారు. ప్రభుత్వం తరపున ప్రకటనలు విరివిగా వస్తుండటమే దీనికి కారణమా, లేక వైసీపీతో లేనిపోని గొడవలెందుకని ఈనాడు సైలెంట్ అయిందా అనేది తేలాల్సి ఉంది.

సమయానుకూలంగా మారడంలో ఈనాడు అందె వేసిన చేయి, అధికారంలో ఉన్నవారితో గొడవ పెట్టుకోదు కానీ, ఎన్నికల సమయానికి మాత్రం ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. 

అప్పటి వరకూ న్యూట్రల్ గా ఉందనుకున్న పత్రిక కాస్తా, వైరి వర్గంపై విష ప్రచారం మొదలు పెడుతుంది. బాబుని వెనకేసుకొస్తుంది. 2024 ఎన్నికలనాటికి కూడా సరిగ్గా ఇదే జరుగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. వచ్చే ఎన్నికల నాటికి ఈనాడు అసలు రంగు మనం చూడొచ్చు. ఎప్పటికీ అది బాబు పత్రికే అనేది మాత్రం వాస్తవం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?