Advertisement

Advertisement


Home > Politics - Telangana

అదే జరిగితే తెలంగాణలో చరిత్రే

అదే జరిగితే తెలంగాణలో చరిత్రే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనిపై ప్రజల్లో సానుకూలత ఉంది. వ్యతిరేకత కూడా ఉంది. ఇది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందని కొందరు చెబుతున్నారు.

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తాము నష్టపోతున్నామని ఈ పథకం ప్రవేశపెట్టిన కొత్తలో ఆటో డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కుటుంబాలు గడవక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రభుత్వం తమకు జీవన భృతి ఇవ్వాలని ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు పలికాయి. గులాబీ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఆందోళనల వార్తలను బాగా హైలైట్ చేశారు. ఈ తరువాత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించి శాంతింపచేసింది.

ఇక ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించే విషయం ఆలోచించాలని ఎండీ సజ్జనార్ కు చెప్పారు. తద్వారా వారికి కూడా సమాన అవకాశాలు దక్కుతాయని అన్నారు. 

మహిళా డ్రైవర్లనూ నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తామని సజ్జనార్ వెల్లడించారు. ఇదే జరిగితే చరిత్ర సృష్టించినట్లే అనుకోవాలి. ఉత్తర్ ప్రదేశ్ లో, మహారాష్ట్రలో ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల్లో మహిళా డ్రైవర్లు ఉన్నారు. దేశంలో అక్కడక్కడా లారీలు, ఇతర హెవీ వెహికల్స్, ఆటోలు నడుపుతున్న మహిళలు ఉన్నారు.

కానీ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల్లో లేరు. ఈ విధానాన్ని యూపీ, మహారాష్ట్ర ప్రవేశపెట్టాయి. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. యూపీ ప్రభుత్వం 2020 లోనే మహిళా డ్రైవర్లను నియమించాలనే నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది నుంచి మహారాష్ట్రలో మహిళా డ్రైవర్లు వచ్చారు. ఒకామె బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చినా వదులుకొని బస్సు డ్రైవర్ గా చేరింది. బస్సు డ్రైవర్లుగా చేరాలనుకునేవారికి ఏడాదిన్నరపాటు శిక్షణ ఇచ్చారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?