Advertisement

Advertisement


Home > Politics - Telangana

గులాబీ నోర్లకు తాళం వేసిన రేవంత్ రెడ్డి

గులాబీ నోర్లకు తాళం వేసిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు వారాలు కూడా గడవక ముందు నుంచే ఆయన పరిపాలనను భ్రష్టుపట్టించడానికి బురదచల్లడం మొదలైపోయింది. తొలి సంతకంగా ఆరు గ్యారంటీల్లో రెండింటిని రేవంత్ అమల్లోకి తెచ్చినా.. గులాబీ దళాలు ఊరుకోలేకపోయాయి.

ఒక వైపు వందరోజుల గడువు ఇస్తాం.. ఆ తర్వాత మా తడాఖా చూపిస్తాం అని ప్రగల్భాలు పలుకుతూనే.. రెండు వారాలు గడవక ముందు నుంచే ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు ప్రారంభించారు. ఉచిత కరెంటు ఎప్పుడిస్తారు.. 500కే గ్యాస్ సిలిండర్ ఎప్పుడిస్తారు? అంటూ చాలా దూకుడుగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలం అని వారు భావించారు.

కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం.. వారు ఒకవైపు వారు చల్లిన బురద మొత్తం నిష్ఫలం అయ్యేలా.. వారి నోర్లకు సమర్థంగా తాళాలు వేసేశారు. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు హామీలను అమల్లోకి తీసుకువచ్చేశారు.

నిజానికి గులాబీ దళాలు రేవంత్ పై బురద చల్లే విషయంలో తొందరపడ్డాయని చెప్పాలి. ప్రభుత్వానికి అవసవరమైన సమయం ఇచ్చి ఉండాల్సింది. వందరోజుల్లోగా హామీలు అమల్లోకి తెస్తాం అని రేవంత్ చెబుతూ వచ్చారు. అదే సమయంలో వందరోజులు (మూడునెలలు) వేచిచూడాలని తమ కేసీఆర్ ఆదేశించినట్టుగా గులాబీ నాయకులు అంటూ వచ్చారు.

మాటలు అన్నారే గానీ.. వారు ఆగలేకపోయారు. వారు అనుకున్న గడువులోగా ఎటూ పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది గనుక.. అప్పుడిక రేవంత్ కొత్త పథకాలను ప్రారంభించడం సాధ్యం కాదు అనే ఆలోచనతో వారు బురద చల్లడాన్ని తీవ్రతరం చేశారు. నోటిఫికేషన్ వచ్చే దాకా సాగదీసి, ఎన్నికల ఫలితాలు వెలువడేదాకా అమలు చేయకుండా కాలయాపన చేయడానికి రేవంత్ కుట్ర చేస్తున్నారని నానా మాటలూ అన్నారు. పైగా పదేపదే అన్నారు.

రేవంత్ హామీలను అమలు చేయడం లేదంటూ తొందరపడి విమర్శలు చేయడం బ్యాక్ ఫైర్ అవుతుందని అప్పట్లోనే గ్రేట్ ఆంధ్ర జోస్యం చెప్పింది. దానికి తగ్గట్టుగానే.. ఈ పథకాల అమలుకు రేషన్ కార్డులను అర్హత ప్రామాణికంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. అమలులోకి తెచ్చేసింది.

ఈ రెండు పథకాలు ఇంకో రెండు నెలలు ఆలస్యం అయితే బాగుండును ప్రభుత్వాన్ని తూలనాడడానికి తమకు అవకాశం దొరుకుతుందని ఆశించిన గులాబీ దళాలు ఇప్పుడు వేరే మార్గాలు వెతుక్కుంటున్నాయి. ఈ హామీల విషయంలో రేవంత్ వారి నోర్లకు తాళాలు వేసేసిన తర్వాత.. పాపం బురద చల్లడం వారికి ఇబ్బంది కరంగా ఉంది. ‘ఇంకా నయం.. తాము ప్రశ్నించడం వల్లనే రేవంత్ త్వరగా 500 గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు ప్రారంభించారని అంటూ సొంత డప్పు కొట్టుకోవడం లేదని’ జనం నవ్వుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?