ఒకప్పటితో పోలిస్తే శృంగారం విషయంలో భారతీయుల దృక్పథం చాలా వరకూ మారిందని అంటున్నారు విశ్లేషకులు. అన్నీ మారినట్టుగానే శృంగారం విషయంలో ఆస్వాధన తీరు కూడా మారిందని వీరు చెబుతున్నారు. ఇండియాలో సెక్స్ గురించి మాట్లాడటం ఒక పాపం… ఇదంతా ఒకప్పటి మాట, వాత్సాయనుడు పుట్టిన ఈ దేశంలో మధ్యలో వచ్చిన కట్టుబాట్లు, వాటి ఫలితంగా ప్రజల్లో సహజంగా జనించిన సంప్రదాయాలు.. భారతీయుల తీరును మార్చేశాయి. సెక్స్ అంటే ఉచ్చరించకూడని పదం అయ్యింది. కొన్ని శతాబ్దాల పాటు ఇదే తీరు కొనసాగింది, కొనసాగుతోంది.
కానీ.. ఈ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు వస్తోందనే మాట వినిపిస్తోంది. మార్పు.. అంటే ఏరకంగా అంటే… సెక్స్ విషయంలో తమకు అడిగింది తీసుకోవడం… మార్పు అంటే, అది బరితెగింపు కాదు, అక్రమ సంబంధాలు కాదు, సక్రమ సంబంధంలో, సురక్షిత లైంగిక సంపర్కంలోనే ఆస్వాధించే తీరు మెరుగైందని దీని అర్థం. ఇండియాలో మగాళ్లకే మెడికల్ షాప్‌కు వెళ్లి కండోమ్ కొనాలంటే బోలెడంత మొహమాటం! ఎవరైనా వచ్చి కండోమ్ అడిగితే.. అతడి వైపు అక్కడున్న జనాలు కూడా పిచ్చిచూపులు, విడ్డూరమైన చూపులు చూస్తారు. అదో జోక్ అయినట్టుగా పగలబడే నవ్వే జనాలూ లేకపోలేదు. ఇప్పటికీ ఇలాంటి వారు చాలా మందే ఉన్నా, అవసరమైనప్పుడు కండోమ్ కొనుక్కోవడానికి మార్గాలు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో.. రెసిడెన్సియల్ ఏరియాస్‌లోని మెడికల్ షాప్స్‌కు మహిళలే వచ్చి కండోమ్ లేదా ఐపిల్‌ను కొనుక్కొనిపోగల ధోరణి అలవాటు అయ్యింది. ఆడోళ్లు వచ్చి ఇలా అడగడం ఏంటి? అని ప్రశ్నించే సంప్రదాయవాదులు హరించుకుపోయారు. అదీ ఒక అవసరం, తీసుకుంటున్నారు అనే ధోరణి పెరిగింది.
ఇదే విషయాన్ని చెబుతున్నాయి ఈ కామర్స్ వెబ్‌సైట్లు కూడా. కేవలం కండోమ్స్ మాత్రమే కాదు, శృంగారోపకరణాల అమ్మకమే ఒక రేంజ్‌లో పెరుగుతోందని అవి చెబుతున్నాయి. రోజు రోజుకూ వీటి విషయంలో ఇండియాలో మార్కెట్ విస్తృతం అవుతోందని అవి చెబుతున్నాయి. గర్భనిరోధక సాధనాలను, లైంగికోత్తేజాన్ని కలిగించే వాటితో మొదలుపెడితే.. సెక్స్ టాయ్స్‌ను కూడా ఇండియన్స్ కొనేస్తున్నారని వయా ఆన్‌లైన్‌తో ఈ కొనుగోళ్లు సాగుతున్నాయని ఈ కామర్స్ సైట్లు తెలిపాయి. ప్రతినెలా వీటి అమ్మకాల్లో పెరుగుదల ఉందని సైట్లు చెబుతుండటం గమనార్హం. అలాగే పండగలను, హ్యాపీ మొమెంట్స్‌ను భారతీయులు సెక్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నారని, పండగల సీజన్‌లో సెక్స్ రిలేటెడ్ ఉపకరణాల ఆర్డర్లు పెరుగుతున్నాయని సైట్లు విశ్లేషిస్తున్నాయి.
ఇండియాలో ఈకామర్స్ విస్తృతి పెరిగింది గత రెండు మూడు సంవత్సరాల్లోనే. ఈ వ్యవధిలో ఈ సైట్ల ద్వారా శృంగార సంబంధ ఉపకరణాల వ్యాపారం వందశాతం వరకూ పెరిగిందట. ప్రతి సీజన్‌కూ ఈ అమ్మకాల్లో పెంపుదల నమోదు అవుతుందోట. దేన్నైనా డైరెక్టుగా అడగాల్సిన అవసరం లేకుండా.. ఇంటర్నెట్‌లో ఆర్డర్ చేసే అవకాశం భారతీయులను చాలా వరకూ మార్చేసిందని ఈ కామర్స్ సైట్ల వ్యాపార విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.