Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జనవరి 9నే అజ్ఞాతవాసి

జనవరి 9నే అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. త్రివిక్రమ్ డైరక్షన్ లో పవర్ స్టార్ చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా కోసం. జనవరి 10న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించేసారు. అయితే అభిమానులకు ఆనందం ఇచ్చే విషయం ఏమిటంటే, అజ్ఞాతవాసి జనవరి 9నే విడుదలయిపోతోంది. జనవరి 9న సెకెండ్ షోతో అజ్ఞాతవాసిని విడుదల చేయాలని హారిక హాసిని సంస్థ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

సాధారణంగా భారీ క్రేజ్ వున్న సినిమాలకు స్పెషల్ షోలు అడుగుతారు. భారీ రేట్లకు అమ్ముతారు కూడా. కానీ ఈ మధ్య హైదరాబాద్ లో మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు ఇవ్వడంలేదు. దీని కోసం భారీగా కిందామీదా పడాల్సి వస్తోంది. ఈ తలకాయ నొప్పి ఎందుకని ఏకంగా విడుదలనే 9 సెకెండ్ షోకి మార్చేస్తున్నారు.

బాహుబలి 2ను ఇలాగే చేసారు. పైగా దీనివల్ల ఓ షో అదనంగా పడుతుంది. దాన్ని జిల్లాల్లో ప్రీమియర్ గా మార్చి అదనపు రేట్లకు అమ్ముతారు. దీనివల్ల ఫస్ట్ డే రికార్డు, ఫస్ట్ వీకెండ్ రికార్డులు వస్తాయి కూడా. 120 కోట్ల రేంజ్ లో థియేటర్ వసూళ్లు సాగించాల్సిన సినిమా అజ్ఞాతవాసి. అందువల్ల ఇలా ముందు విడుదల చేయడం మంచి ప్లానింగ్ నే అనుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?