Advertisement

Advertisement


Home > Politics - Telangana

అప్పుడు మాట్లాడలేకపోయింది.. ఇప్పుడు చెలరేగిపోతుందేమో

అప్పుడు మాట్లాడలేకపోయింది.. ఇప్పుడు చెలరేగిపోతుందేమో

తెలంగాణలో స్టార్ క్యాంపైనర్‌గా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి మాజీ గవర్నర్ తమిళిసై వచ్చేసింది. ఆమె తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలు. ఆమె గురించి ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. ఆమె గవర్నర్ గా ఉన్నప్పుడు ఆమెను బీజేపీ మనిషిగా అప్పుడు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ముద్ర వేసింది. రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారని ఆరోపించింది. అప్పటి సీఎం కేసీఆర్ అడుగడుగునా ఆమెను అవమానించాడు. ఆయన బాటలోనే అప్పటి మంత్రులు నడిచారు. పదవులు లేనివాళ్లు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.

కేసీఆర్ సర్కారు ఆమె విషయంలో ప్రోటోకాల్ పాటించలేదు. మర్యాద మన్నన ఏమీ లేవు. బీజేపీ మీద, మోడీ మీద ఉన్న కోపాన్ని ఆమె మీద చూపించాడు కేసీఆర్. తమిళిసై పట్ల కేసీఆర్ ప్రవర్తన గురించి చెప్పుకోవాలంటే భారతమంత అవుతుంది. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఆయనకు స్వాగతం పలకకుండా అవమానించాడు కేసీఆర్. ఇక గవర్నర్ ఆయనకో లెక్కా? కేసీఆర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఎలా వ్యవహరించినా, ఏం మాట్లాడినా చెల్లింది. తమిళిసై కూడా బేసిగ్గా పొలిటీషియన్ అయినా గవర్నర్ పదవిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అవకాశం లేదు. 

అది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి పరిమితులుంటాయి. అందుకే మనసులో కేసీఆర్ మీద కోపం ఉన్నప్పటికీ నోరు కట్టేసుకుంది. అయినప్పటికీ అప్పుడప్పుడూ పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టేది. సాధారణంగా గవర్నర్ లాంటి వారు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వరు. కానీ తమిళిసై ఒక తెలుగు టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమిళిసై చేసిన కొన్ని పనులు అప్పటి సీఎం కేసీఆర్‌కు కోపం తెప్పించాయి. ఆమె ప్రజా దర్బార్ నిర్వహించడం, కొన్ని అంశాలపై అధికారుల నుంచి నేరుగా రిపోర్టులు తెప్పించుకోవడం, కొన్ని ప్రాంతాలకు వెళ్లి సమస్యలు తెలుసుకోవడం... ఇలాంటి పనులు కేసీఆర్ కు నచ్చలేదు.

ముఖ్యంగా కేసీఆర్ చెప్పిన వారికి ఆమె గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదు. నెలల తరబడి పెండింగ్ లో పెట్టింది. అందుకు తనకున్న అభ్యంతరాలు తెలియచేసింది. ఒకసారో రెండుసార్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అందుకు ప్రభుత్వం యేవో కారణాలు చెప్పి సమర్ధించుకుంది. ఇలా ఎన్నెనో కారణాలతో కేసీఆర్ తమిసైని దూరం పెట్టేశాడు. ఇందుకు భిన్నంగా అంతకు ముందున్న గవర్నర్ నరసింహన్ ను కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నాడు. 

ఆయన కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉన్నాడు. ఈయన ఏది చెబితే ఆయన అది చేశాడు. కానీ తమిళిసై కొద్దిగా స్వతంత్రంగా వ్యవహరించింది. అది కేసీఆర్ కు నచ్చలేదు. ఇప్పుడు ప్రచారానికి వచ్చిన తమిళిసై స్వేచ్చా జీవి. అచ్చమైన బీజేపీ నాయకురాలు. అందులోనూ స్టార్ క్యాంపైనర్. గులాబీ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద చెలరేగిపోయే అవకాశం ఉంది. ఆమెను అవమానించిన కేసీఆర్ అధికారంలో లేడు. గులాబీ పార్టీ చచ్చుబడిపోయి ఉంది. 

కాబట్టి ఇది తమిళిసైకి మంచి అవకాశం. ఆమె బీఆర్ఎస్ ను దుమ్ము దులపొచ్చు. ఆమె తెలంగాణలో పది రోజులు ప్రచారం చేస్తుంది. హైదరాబాదులో తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వారిని ఆకట్టుకునే ప్రచారం చేస్తుంది. తమిళిసై తెలంగాణ ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆమె ప్రచారం మీద ఆసక్తి ఉంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?