ప్రస్తుతం మార్కెట్లో సినిమాలన్నీ ఇలా వస్తున్నాయి, అలా వెళ్తున్నాయి. గట్టిగా నిలబడిన సినిమా ఒక్కటి కనిపించడం లేదు. దీంతో నైజాంలో సింగిల్ స్క్రీన్స్ కూడా మూసేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కృష్ణమ్మ నుంచి ప్రకటన వచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందంట.
గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రిలీజైన వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ అయినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు. తొలి రోజు ఈ సినిమాకు కోటి రూపాయల గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత 5 రోజుల్లో 5.4 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిందట.
ఫలితంగా తమ సినిమా వారం లోపే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు కృష్ణమ్మ టీమ్ ప్రకటించుకుంది. అంతేకాదు, సత్యదేవ్ కెరీర్ లోనే ఇవి బెస్ట్ కలెక్షన్లు అంట.
నిజానికి కృష్ణమ్మ సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాలేదు. రివెంజ్ డ్రామా సబ్జెక్ట్ ను ఎంచుకున్నప్పటికీ, సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా బలమైన క్లయిమాక్స్ లేదు. అలా యావరేజ్ టాక్ తో మొదలైన కృష్ణమ్మ, వారం తిరక్కముందే బ్రేక్ ఈవెన్ అయిందంటే గొప్ప విషయమే.