నటి సురేఖ వాణి కూతురు సుప్రీత, టాలీవుడ్ డెబ్యూపై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. అంతలోనే ఆమె చిక్కుల్లో పడింది. దీనికి కారణం ఆమె బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయడమే.
బెట్టింగ్ యాప్స్ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యాప్స్ బారిన పడి ఆస్తులు కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలు సైతం తీసుకున్నారు. ఇలాంటి యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్లపై ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్లను హెచ్చరిస్తూ వస్తున్నారు సజ్జనార్. ఇందులో భాగంగా పలు అరెస్టులు కూడా చోటుచేసుకుంటున్నాయి. లోకల్ బాయ్ నాని అనే ఇన్ ఫ్లూయన్సర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అదే విధంగా ఇంటర్నేషనల్ బైక్ రైడర్ బన్నీ సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట జిల్లా నూతన్ కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇలాంటి ఓ యాప్ ను సురేఖవాణి కూతురు కూడా ప్రమోట్ చేసి పోలీసుల దృష్టిలో పడింది. అందుకే సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది.
“కొంతమంది ఇన్ ఫ్లూయన్సర్లు తెలిసోతెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు ఆ పని చేయడం ఆపేశాను. గతంలో ప్రమోట్ చేసినందుకు సారీ. ఇంకా ఎవరైనా ఇన్ ప్ల్యూయన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఆపేయండి.”
ఇలా సారీ చెబుతూ వీడియో పెట్టింది సుప్రీత. అయితే సారీతో అయిపోయేది కాదిది. గతంలో లోకల్ బాయ్ నాని కూడా సారీ చెప్పాడు, అయినా అరెస్ట్ తప్పలేదు. సుప్రీతపై కూడా కేసు పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Ayo
tana bratuku kosam , itaru la nu munchadam ante ide
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
“sorry” ane word ni tissue paper laa vaadukuntunaaru !!