కూలీ సినిమాకు భారీ ఓటిటి రేటు

నిజానికి ఇప్పుడు ఓటిటి రేట్లు పెద్దగా పలకడం లేదు. కానీ మంచి ప్రాజెక్ట్‌లు వస్తే మాత్రం ఓటిటి సంస్థలు వదలడం లేదు. మంచి రేట్లు ఇచ్చి తీసుకుంటున్నాయి.

పాన్ ఇండియా తమిళ సినిమా కూలీకి భారీ డిజిటల్ రేటు వచ్చింది. రజనీ, నాగార్జున, అమీర్ ఖాన్ ఇలా చాలా మంది హెమా హెమీలి నటించిన ఈ సినిమాకు ఓటిటి హక్కుల రూపంలో 120 కోట్లు వచ్చాయి. ఇది భారీ రేటునే. ఈ సినిమాకు అన్ని రేట్లు భారీగానే వున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడం ఓ పెద్ద అడ్వాంటేజ్.

ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు 45 కోట్ల మేరకు పలుకుతున్నాయి. ఆసియన్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. హెమా హెమీలి నటించారు అంటే సినిమా నిర్మాణ వ్యయం భారీగానే అయి వుంటుంది. పైగా భారీ సినిమా కాబట్టి ఇంకా అదనపు ఖర్చు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

జాట్‌కు 40 కోట్లు

మైత్రీ మూవీస్ నిర్మించిన హిందీ సినిమా జాట్ ఓటిటి హక్కులు 40 కోట్లకు అగ్రిమెంట్ కుదిరింది. ఈ సినిమాకు 140 కోట్ల వరకు వ్యయం అయిందని అంచనా. అందులో 40 కోట్లు ఓటిటి ద్వారానే వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు గోపీచంద్ మలినేని. హీరో సన్నీ దేవోల్. మైత్రీ సంస్థనే నిర్మిస్తున్న హిందీ సినిమా ఇది.

నిజానికి ఇప్పుడు ఓటిటి రేట్లు పెద్దగా పలకడం లేదు. కానీ మంచి ప్రాజెక్ట్‌లు వస్తే మాత్రం ఓటిటి సంస్థలు వదలడం లేదు. మంచి రేట్లు ఇచ్చి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా భారీ, ఈవెంట్ సినిమాలను మాత్రం వదలడం లేదు. కూలీ, జాట్ సినిమాలకు మంచి రేట్లు దక్కడానికి కారణం ఇదే.

2 Replies to “కూలీ సినిమాకు భారీ ఓటిటి రేటు”

Comments are closed.