మధ్యాహ్నం నుంచి కన్నడ చిత్రసీమ అట్టుడికిపోయింది. హీరో ఉపేంద్రకు ఏదో అయింది, అతడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడనే ప్రచారం నిమిషాల్లో వైరల్ అయింది. దీంతో ఉపేంద్ర అభిమానుల్లో ఒకటే టెన్షన్. మరికొంతమంది ఫ్యాన్స్ అయితే హాస్పిటల్ కు పరుగులు తీశారు.
ఇలా ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితిపై ఒకటే హంగామా నడిచింది. ఉపేంద్ర హాస్పిటల్ లో జాయిన్ అయిన మాట వాస్తవం. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఉపేంద్ర జాయిన్ అయ్యారు. అయితే అనారోగ్యంతో తను హాస్పిటల్ కు వెళ్లలేదని ఉపేంద్ర క్లారిటీ ఇచ్చాడు.
56 ఏళ్ల ఉపేంద్ర రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఆరోగ్య పరీక్షల కోసం మాత్రమే వచ్చాను.. ఎలాంటి పుకార్లు నమ్మొద్దు” అంటూ ట్వీట్ చేశారు.
ఉపేంద్ర ట్వీట్ తో ఆయన అభిమానులు శాంతించారు. ఆయన అభిమానులే కాదు, శాండిల్ వుడ్ మొత్తం కుదుటపడింది. ప్రస్తుతం ఈ నటుడు, రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో పాటు మరో 2 కన్నడ సినిమాలు ఉపేంద్ర చేతిలో ఉన్నాయి.
Fans ki Amma Nana LA kanna heroes ekkuva. Chee
Avunu sir andhuke vallu celebrities ayeee crores prajala dabbu thinyunaru