అజయ్ భూపతి.. సూపర్ స్టార్ ఫ్యామిలీ

టాలీవుడ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న వారసుడిని వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు అజయ్ భూపతి తీసుకున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న వారసుడిని వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతను దర్శకుడు అజయ్ భూపతి తీసుకున్నారు. హీరో కృష్ణ తనయుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా తయారయ్యే సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది.

తొలి సినిమా ఆర్ ఎక్స్ 100 తోనే మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవల మంగళవారం అనే థ్రిల్లర్ తో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం మంగళవారం 2 సీక్వెల్ మీద వర్క్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ ను అందుకున్నారు. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

సినిమా జానర్ ఏమిటి? ఎప్పటి నుంచి వుంటుంది? ఇవన్నీ ఇంకా తెలియాల్సి వుంది. గతంలో జయకృష్ణ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. లండన్ లో శిక్షణ పొందుతున్నారని వార్తలు వచ్చాయి.

బాబాయ్ మహేష్ బాబు నే ఇవన్నీ దగ్గర వుండి చూస్తున్నారు. బహుశా ఈ ప్రాజెక్ట్ కూడా ఆయన పర్యవేక్షణలోనే వుండొచ్చు.

3 Replies to “అజయ్ భూపతి.. సూపర్ స్టార్ ఫ్యామిలీ”

  1. Launch anedi under reasonable budget cap undali. A very minimum budget lo thayaravvali. Alakaka  Akkineni Akhil levello unte matram chala chala kashtam. Kabatti keep the budget very low and amke it a hit movie.

  2. డబ్బున్న వాళ్ల పిల్లల గమ్యం రాజకీయాల, సినిమా లేదా వ్యాపారం.

    తస్సడియా, తెలివైన పేద పిల్లలకు కూడా ఇలాంటి అవకాశాలు ఉంటే బాగుండు.

    1. వివిధ కారణాల తో పల్లకి మోయడానికి  సామాన్యులు సిద్ధంగా ఉండాలే గానీ, ఎక్కడానికి మొక్క పేరు చెప్పుకుంటే సరి.

Comments are closed.