సునీతా విలియమ్స్ బయోపిక్

అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలయమ్స్ లైఫ్ స్టోరీకి సంబంధం వుందని తెలుస్తోంది.

హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఏ సినిమా చేసినా సమ్ థింగ్ డిఫరెంట్ గా వుండాల్సిందే. మహా నటి నుంచి లక్కీ భాస్కర్ వరకు ప్రూవ్ అవుతూ వస్తున్న సంగతి అది. దుల్కర్ ఆల్ మోస్ట్ చాలా మంది తెలుగు హీరోల కన్నా ఎక్కువగా తెలుగులో సినిమాలు ఓకె చేసి వుంచారు.

ప్రస్తుతం ఓ సినిమా వర్క్ జరుగుతోంది. ఈ సినిమా కు అంతరిక్ష యాత్రికురాలు సునీతా విలయమ్స్ లైఫ్ స్టోరీకి సంబంధం వుందని తెలుస్తోంది. అయితే అలా అని అంతరిక్షం..వగైరా ఏమీ వుండవు.

కేవలం ఓ పల్లె నుంచి నాసా వరకు ఎలా ఎదిగారు అన్న పాయింట్ ను తీసుకుని, ఓ యువకుడి కథగా మలిచినట్లు తెలుస్తోంది. సినిమాకు టైటిల్ కూడా ఆకాశంలో ఓక తార అని పెట్టడానికి రీజన్ అదే అంట. ఏమైనా దుల్కర్ కథ ఒప్పుకుంటే సమ్ థింగ్ వుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లోకి వెళ్తే అతని సినిమాలకు ఓ ఫ్యాన్స్ బేస్ అన్నది బలంగా ఏర్పాటు అవుతూ వస్తుంది.

దుల్కర్ ఆకాశంలో ఒక తార కాకుండా మరో మూడు తెలుగు సినిమాలు చేయాల్సి వుంది. వాటిలో సుధాకర్ చెరుకూరి సినిమా ఒకటి.