పొగడ్తలు తప్ప మురిసిపోయే పాయింటుందా?

శంకుస్థాపన కార్యక్రమం నాడు వచ్చి.. పవన్ కల్యాణ్ కు ‘దగ్గు మిఠాయి’ ఇవ్వడం తప్ప.. రాష్ట్రానికి ప్రధాని మోడీ చేసిందేమీ లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

‘ప్రధాని నరేంద్ర మోడీ ఒక అద్భుతం.. ఆయన ఆశీస్సులు ఉంటే చాలు.. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి మరేమీ అక్కర్లేదు’ అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఆయనను వేనోళ్ళ కీర్తించారు! పొగడ్తలకు పొగడ్తలే కానుక అన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే స్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కీర్తించారు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు మాటల్లో చెప్పాలంటే అమరావతి పనుల పునర్నిర్మాణ శంకుస్థాపన వేదిక ఒకరినొకరు పొగుడుకోడానికి మాత్రమే పరిమితమైంది. ఈ పొగడ్తలు వారి వారి అభిమానులకు మహా ముచ్చటగా కనిపిస్తుండవచ్చు. కానీ ఒక్క క్షణం ఆ ముచ్చటను మర్చిపోయి ప్రాక్టికల్‌గా ఈ సభ జరిగిన తీరు గురించి విశ్లేషించుకున్నప్పుడు ఎవరికైనా కించిత్తు తృప్తి కలుగుతుందా అనేది అనుమానమే.

అమరావతి పనుల పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం మనం మోడీని పిలిచాం. ఆయన వచ్చారు. ఆ పని చేశారు.. వెళ్లిపోయారు! అంతకు మించి ఏం జరిగింది. చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను పొగిడారు. దేశప్రధాని అతిథిగా మన రాష్ట్రానికి ఇలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి వచ్చినప్పుడు.. కేంద్రం తరఫున.. మనం ఊహించని, మనం అడగని వరాలు ఒక్కటైనా ప్రకటిస్తారు.. అనే ఆశ రాష్ట్ర ప్రజల్లో ఉంటుంది. కానీ.. నరేంద్రమోడీ చాలా జాగ్రత్తగా ఒక్క వరం కూడా ప్రకటించకుండానే తిరిగి వెళ్లిపోయారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. శంకుస్థాపన కార్యక్రమం నాడు వచ్చి.. పవన్ కల్యాణ్ కు ‘దగ్గు మిఠాయి’ ఇవ్వడం తప్ప.. రాష్ట్రానికి ప్రధాని మోడీ చేసిందేమీ లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మోడీ ఇలా చేయడం ఇది తొలిసారి కాదు. 2015లో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు కూడా.. ఓ చెంబుతో మట్టి, మరో చెంబుతో గంగాజలం తెచ్చి కానుకగా ఇచ్చారు నరేంద్రమోడీ. ఈసారి ఇలాంటి పనిచేయలేదు గానీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో రాజధానికి కానుకగా ఆయన ఏదో ఒక కొత్త ప్రకటన చేస్తారని రాష్ట్రప్రజలు ఎదురు చూశారు. అయితే అలా జరగలేదు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఇదే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ ఎంతగా పొగిడినా కూడా.. ప్రధాని నరేంద్రమోడీ అమరావతి కోసం ప్రత్యేకంగా నిధులేమీ ఇవ్వనేలేదని, ఏపీ ప్రజలు పెట్టుకున్న ఆశలను మోడీ నీరుగార్చారని రామక్రిష్ణ అంటున్నారు.

చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారు గానీ.. రాజధాని కోసం లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి ప్రజలపై భారం మోపుతున్నారని రామక్రిష్ణ నిలదీస్తున్నారు.

5 Replies to “పొగడ్తలు తప్ప మురిసిపోయే పాయింటుందా?”

  1. How many more articles would you write on this useless topic, GA? It is decised that all thisnis nothing but anpublicity stunt to promote real estate for flood affected area.

  2. Correct Title: కడుపు మంట తప్పా ఎడ్చె పాయిటింట్ ఉందా?

    .

    అమరావతి కి కెంద్రం 15,000 కొట్లు సాహాయం చెస్తుంది. ఇప్పటికె అప్పు ద్వరా ఆ డబ్బు సమకూర్చటానికి ముందుకు వచ్చింది. అది కెంద్రమె బరిస్తుంది.

    అలానె అమరావతి రింగ్ రొడ్డుని భూసెకరణ తొ సహా కెంద్రమె భరిస్తుంది.

    .

    సాక్షి లొ అయితె ఎడుపు మామూలుగా లెదు!

  3. మనకి ENO తప్ప మంటకు దిక్కుండా?మంట కింద అయితే బర్నాల్ వాడు

Comments are closed.